ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని రోడ్కలి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రజలను తీవ్రంగా కుదిపేసింది. ముస్కాన్ అనే 24 ఏళ్ల మహిళ తన భర్త వసీం దూరంగా ఉండడం చూసుకొని జునైద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిందని పోలీసులు వెల్లడించారు.

హత్య పథకం:
ముస్కాన్ తన ప్రియుడు జునైద్‌తో కలిసి ముందుగా హత్య పథకాన్ని సిద్ధం చేసింది. ముస్కాన్ అనే (24) ఏళ్ల మహిళకు వసీం అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లిద్దరికి ప్రస్తుతం అర్హాన్, ఇనాయా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్త వసీం ఉద్యోగం నిమిత్తం చండీగఢ్‌లో ఉంటూ అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని కలిసి వెళ్తూ ఉంటాడు. భార్త ఇంటి పాటున ఉండకపోవడంతో భార్య ముస్కాన్ జునైద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ప్రేమ కంటే పిల్లలూ అడ్డా?
వివాహేతర సంబంధం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ, ఇలా కాదని ఇద్దరూ కలిసి కొత్త జీవితం ప్రారంబిద్దాం అనుకున్నారు. కానీ అందుకు పిల్లలు అడ్డుగా ఉండడంతో వాళ్లని అడ్డు తొలగించుకోవాలనుకున్న ముస్కాన్, ప్రియుడు జునైద్‌లో కలిసి ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసింది.
పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది:
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు. . ఇద్దరు పిల్లల మృతిపై అనుమానం రావడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు విచారణలో పోలీసులు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు. పిల్లల మరణంలో తల్లి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ముస్కాన్‌ను వెతికి పట్టుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.
హనీమూన్‌కు ప్లాన్ కూడా
ఇంత ఘోరమైన పాపాన్ని చేసిన అనంతరం, ప్రియుడితో కలిసి ముస్కాన్ హనీమూన్‌కు వెళ్లేందుకు ప్లాన్ కూడా వేసుకున్నట్లు పోలీసుల గుర్తించారు. అయితే ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముస్కాన్‌ను అరెస్ట్ చేయగా ఆమె ప్రియుడు జునైద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read also: Iruku Gopi: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనంతరం యువకుడి ఆత్మహత్య