తెలంగాణ(Telangana) లో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల (Southwest monsoon) ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది శనివారం, ఆదివారం రోజుల్లో మరింత ప్రభావాన్ని చూపనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రభావం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల రూపంలో కనిపించనుంది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
తెలంగాణలో వర్షాల తీరును పరిశీలిస్తే, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు సహితంగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలుల వీస్తాయని వాతవరణ శాఖ తెలిపింది.
ఈదురు గాలులు బలంగా వీచే సూచనలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికల ప్రకారం, రాష్ట్రంలోని శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులు వీస్తాయని వాతవరణ శాఖ తెలిపింది.
వర్షాలు కురిసే జిల్లాల వివరాలు
వాతావరణ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం శనివారం వర్షాలు కురిసే జిల్లాలుగా ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉష్ణోగ్రతల స్థితి
వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఉష్ణోగ్రతల స్థితిలో కూడా కొంత మార్పు చోటుచేసుకోనుంది. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే శనివారం తెలంగాణలోని ఖమ్మం1 జిల్లాలో గరిష్టంగా 37.4, మహబూబ్ నగర్ జిల్లాలో కనిష్టంగా 30.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో వర్ష సూచనలు
తెలంగాణ మాత్రమే కాకుండా, బంగాళఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనా పడనుంది. ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యుత్ తారలు వంటి వాటికి దూరంగా ఉండటం, ఇంట్లో ఉండే ప్రయత్నం చేయడం, ప్రయాణాలు అనవసరంగా మానుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read also: Rain Alert: బలపడిన నైరుతి రుతుపవనాలు పలు రాష్ట్రాల్లో వర్షాలు