విశాఖపట్నం(Vizag)లో యోగాంధ్ర-2025 వేడుకలు(Yogandhra 2025 ) వైభవంగా ప్రారంభం కానున్నాయి. రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు యోగా మహాసభలకు 29 కిలోమీటర్ల పొడవునా 3.26 లక్షల మంది పాల్గొనేలా 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చారిత్రక కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపులోకి తీసుకువెళ్లే ప్రయత్నంగా నిలుస్తోంది.
యోగాపై దేశ ప్రజల ఆసక్తి పెరుగుతోంది
ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా 11% మంది ప్రతిరోజూ యోగా చేస్తామని, మరో 13% మంది అప్పుడప్పుడు చేస్తామని తెలిపారు. అయితే ఇంకా 75% మంది యోగాపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చైతన్య కార్యక్రమాలు, డిజిటల్ వేదికలు, పంచాయితీ పార్కులను యోగా పార్కులుగా అభివృద్ధి చేయడం వంటి చర్యలు చేపట్టింది.
యోగాతో మానవాళికి శాంతి మార్గం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) యోగా ప్రాధాన్యాన్ని వివరిస్తూ, “ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, అశాంతి పెరిగిన వేళ యోగా మానవాళికి శాంతి మార్గాన్ని చూపుతుంది. ఇది పాజ్ బటన్ లాంటిది – మనల్ని ఆలోచింపజేస్తుంది, ఏకత్వాన్ని కలిగిస్తుంది,” అని అన్నారు. ఆయన ప్రతిపాదనపై 175 దేశాలు తక్కువ సమయంలోనే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మద్దతు తెలపడం గొప్ప విషయం అని ప్రధాని అభిప్రాయపడ్డారు.
Read Also : Yoga Day 2025: గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకలు