తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్టు (Padi Kaushik Reddy Arrest) చేశారు. ఆయనపై భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) కింద 308(2), 308(4), 352 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అనంతరం విచారణ నిమిత్తం ఆయన్ను వరంగల్‌కి తరలించారు.
క్వారీ యజమానిపై బెదిరింపు ఆరోపణలు
వివరాల్లోకి వెళితే… కమలాపురం మండలం వంగపల్లిలోని గ్రానైట్ క్వారీ యజమాని కుటుంబం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. కౌశిక్ రెడ్డి రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును ఆధారంగా తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కౌశిక్ రెడ్డి ఏప్రిల్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, జూన్ 16న కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.
కోర్టు తీర్పు అనంతరం అరెస్ట్
కోర్టు తన పిటిషన్‌ను కొట్టివేయడంతో పోలీసులు వెంటనే చర్యలకు దిగారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ అరెస్ట్‌ను పిలుపుతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి ఇది మరొక దెబ్బగా భావిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై అధికార, విపక్ష పార్టీల మధ్య రాజకీయ దుమారం రేగే అవకాశముంది.
Read Also : Yoga Day 2025 : అంతర్జాతీయ యోగా డే వేడుకలకు 11 ఏళ్లు