हिन्दी | Epaper
హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Transportation sector: రవాణా రంగంలో పెనుమార్పులు

Digital
Transportation sector: రవాణా రంగంలో పెనుమార్పులు

మారుతున్న కాలానికి అనుగుణంగా త్వరితగతిన గమ్యానికి చేరడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఛార్జీలు అధికంగా ఉన్నప్పటికీ గమ్యం చేరడం ప్రధాన లక్ష్యంగా మారింది. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లు, బుల్లెట్ రైళ్లు వచ్చాయి. విమానాలకు కూడా నిత్యం రద్దీ పెరుగుతూనే ఉంది. విమానయానం చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మనకు నాలుగు రకాలైన ప్రయాణ సౌకర్యాలు(transportation sectors) ఉన్నాయి. రోడ్డు మార్గం, రైల్వేలు, ఆకాశమార్గం, సముద్రయానం వంటివి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అయిదవ తరంగా హైపర్అూప్ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటలో వస్తే విమానాల కంటే రెండు, మూడు రెట్లు వేగంగా ‘గమ్యం చేరే అవకాశం కలుగుతుంది. గరిష్టంగా గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ఈ హైపర్ లూప్ వాహనాలు గమ్యం చేరుకుంటాయి.

వాహనమేదైనా ముందుకు కదలాలంటే చాలా గురుత్వాకర్షణ శక్తితోపాటు, గాలివేగం, పీడనం వంటి అనేక రకాల శక్తులను అధిగమించాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిమితులేవీ లేని అంతరిక్షంలో అతితక్కువ ఇంధనంతోనే ఉపగ్రహాలు అతివేగంతో వెళతాయి. హైపర్ లూప్ టెక్నాలజీ కూడా ఇలాంటిదే. కాకపోతే అంతరిక్షంలోని పరిస్థితులను కొద్దిగా మార్చి ఉపయోగిస్తారు.

ముందుగా ఈ వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార దిగ్గజంగా పేరొందిన టెస్లా అధినేత ఎలాన్
మస్క్
.ప్రకటించారు. 2013లోనే మస్క్ ఈ వ్యవస్థ గురించి ప్రతిపాదించారు. అయితే ఈ వ్యవస్థపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాస్తవ రూపం దాల్చే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. ఇంత వేగంగా వాహనం కదిలే పరిస్థితులు లేవని, ఒకవేళ సాధ్యపడినా అనేక ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే మస్క్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని అధ్యయనాలు నిర్వహించి దానిని కార్యాచరణలో పెట్టారు.

ప్రస్తుతం మన దేశంలో కూడా మద్రాస్ ఐఐటి బృందం హైపర్లూప్(hyperloop) వ్యవస్థను విజయ వంతంగా రూపకల్పన చేసింది. సుమారు నాలుగు వందల కిలోమీటర్ల మేర ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి విజయం సాధించారు. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో పాటు రైల్వే శాఖ నుంచి నిధులు అందించారు. ఈ వ్యవస్థ విజయవంతం అయిందని రైల్వే శాఖ మంత్రి అంజనీ వైష్ణవ్ ఇటీవల ట్విట్టర్లో ప్రకటించారు.

ప్రయోగాత్మకంగా న్యూఢిల్లీ నుంచి జైపూర్కు హైపర్ లూప్ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి తిరుపతికిగానీ, విశాఖపట్నానికి గానీ కేవలం 30 నిమిషాల వ్యవధిలోపే వెళ్లే అవకాశం ఉంటుంది.

హైపర్ లూప్(hyperloop) మార్గాన్ని ఏర్పాటుచేయడానికి సాధారణ రైల్వే మార్గం ఏర్పాటుకు అయ్యే ఖర్చు కంటే కేవలం పదవ శాతం ఖర్చుతో పూర్తి చేయవచ్చు. రైలు, రోడ్డు మార్గాల నిర్మాణానికి పెద్ద ఎత్తున భూసేకరణ చేయాల్సి ఉంటుంది. హైపర్ లూప్ వ్యవస్థకు ఆ స్థాయిలో భూసేకరణ అవసరం ఉండదు. చిన్న చిన్న స్థంభాలు ఏర్పాటు చేసి దానిపై టన్నెల్ (గొట్టం) మార్గాన్ని ఏర్పాటుచేస్తారు. ఈ టన్నెల్ లోపల గాలి ఏమాత్రం ఉండకుండా శూన్యత ఏర్పడుతుంది. అందులో కాప్సుల్ వంటి వాహనాలను పంపుతారు.

ఒక్కొక్క క్యాపుల్స్ లో సుమారు 28 నుండి 32 మంది కూర్చొనే వీలు కలుగుతుంది. వాయు వత్తిడి ఏమాత్రం లేకపోవడంతో అతివేగంగా ముందుకు కదలడానికి టన్నెల్ సంసిద్ధంగా ఉంటుంది. క్యాప్సుల్కు ముందు అత్యంత శక్తివంతమైన ఫ్యాను ఏర్పాటు చేస్తారు. ఇది శూన్యం నుంచి అతితక్కువ మోతాదులో గాలిని సేకరించి క్యాప్సుల్ లోపలికి పంపించడంతో పాటు సదరు వాహనం వాయువేగంతో ముందుకు కదలడానికి దోహదం చేస్తుంది.

అయితే ఈ వాహనం నేలపై అంటే క్యాప్సుల్ దిగువ భాగాన్ని తాకకుండా అర అంగుళం నుంచి అంగుళం ఎత్తులో ప్రయాణిస్తుంది. దీనివల్ల క్యాప్సుల్ ఎంతవేగంగా కదిలినా లోపల ఉండే ప్రయాణికులకు ఎలాంటి వత్తిడి గాని, కుదుపులుగాని ఉండవు.

ప్రతి వంద కిలోమీటర్లకు ఒక ట్రాన్స్ ఫార్మర్ లాంటి పరికరాన్ని అమర్చుతారు. ఇది వాహనం వేగాన్ని నియంత్రిస్తుంది. అతివేగంగా ముందుకు దూసుకుపోవడానికి, గమ్యం సమీపించే సమయంతో వేగం తగ్గించడానికి ఈ ట్రాన్స్ ఫార్మర్లు పనిచేస్తాయి.

అతివేగంగా వెళ్లినప్పటికీ ఇవి ప్రమాదాలకు గురికాకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక టన్నెల్ వాహనం వెళ్లడానికి, మరో టన్నెల్ వాహనం రావడానికి వీలుగా తయారు చేస్తారు. దీనితో వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టే అవకాశం ఉండదు.

ఈ క్యాపుల్స్ వంటి వాహనంలో కేవలం 28 నుంచి 32 మంది వరకు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. దీనితో ఒకదాని వెనుక మరొక దానికి పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తారు.

ముందుగా కొంత కాలం సరుకు రవాణాకు ఉపయోగించి ప్రయోగం ఫలవంతమైతే ప్రయాణికులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రవాణా రంగంలో(Transportation) పెనుమార్పులు వచ్చినట్లు భావించవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న వేగవంతమైన ప్రయోగాలను పరిశీలిస్తే రెండు మూడేళ్లలో హైపర్లూప్ వ్యవస్థ ఉపరితల రవాణాలో(Transportation) కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది.

Read Also: waste:వ్యర్థాలను తగ్గిస్తేనే భవిష్యత్తు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870