పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్(Pakistan Army Chief General Asim Munir) కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైట్ హౌస్‌లో విందు ఇచ్చిన విషయంపై భారత రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఈ సమావేశంపై తీవ్రంగా స్పందించారు. 2001లో జరిగిన విశ్వవాణిజ్య కేంద్రంపై (WTC) దాడి చేసిన ఉసామా బిన్ లాడెన్‌ను పాకిస్థాన్ దాచిన చరిత్రను అమెరికన్లు మర్చిపోలేరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
పాక్ పై అమెరికాకు గల చారిత్రక క్షోభ గుర్తు చేసిన థరూర్
శశి థరూర్ మాట్లాడుతూ, ఆఫ్గనిస్తాన్‌లోని టోరా బోరా నుంచి పారిపోయిన బిన్ లాడెన్‌ను పాకిస్థాన్ ఆర్మీ క్యాంప్ సమీపంలో ఏళ్లు దాచిపెట్టిన ఘనత పాక్‌కే దక్కుతుందన్నారు. అలాంటి దేశానికి చెందిన ఆర్మీ చీఫ్‌కు అమెరికా విందు ఇవ్వడాన్ని ఆయన ఆశ్చర్యంగా అభివర్ణించారు. అమెరికా ప్రజల శక్తిమంతమైన జ్ఞాపకశక్తి ఉంటుందని, కానీ అక్కడి కొన్ని రాజకీయ నాయకులు గతాన్ని సులభంగా మర్చిపోతారన్న సెటైర్లు ఆయన విసిరారు.
అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా ద్వంద్వ ధోరణిపై వ్యాఖ్యలు
థరూర్ వ్యాఖ్యల ద్వారా అమెరికా విదేశాంగ విధానాల్లో ఉన్న ద్వంద్వ ధోరణిని ఆయన ఎత్తిచూపారు. ఒకవైపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ ప్రపంచానికి హామీ ఇస్తూ, మరోవైపు ఉగ్రవాదులకు సహకరించిన దేశ ప్రతినిధులకు విందులు ఇవ్వడం దారుణమని విమర్శించారు. ట్రంప్ ఇలా వ్యవహరించడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని, ఇది అంతర్జాతీయ సమీకరణాల్లో అపనమ్మకానికి దారితీసే ప్రమాదం ఉందని శశి థరూర్ హితవు పలికారు.
Read Also : Metro Phase-2 : మెట్రో ఫేజ్-2కు అనుమతులివ్వండి – సీఎం రేవంత్