ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం హార్దోలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలిచివేస్తోంది. షారుఖ్ అనే వ్యక్తి తన కొడుకు ఆర్యన్‌ను బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో హుటాహుటిన ఆస్పత్రి Govt Hospitalకి తీసుకెళ్లాడు. కానీ అక్కడి వైద్యుల నిర్లక్ష్యం చిన్నారిని బలితీసుకుంది.ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉందని స్థానిక సీహెచ్‌సీ వైద్యులు తెలిపారు. వెంటనే జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. షారుఖ్ వెంటనే అక్కడికి తీసుకెళ్లి నేరుగా ఎమర్జెన్సీకి చేరాడు. కానీ అక్కడి వైద్యులు చిన్నారిని పట్టించుకోలేదు. సిబ్బంది స్పందించలేదు. ఎంత వేడుకున్నా వైద్యం ప్రారంభించలేదు.
ఆక్సిజన్ వేయకుండానే చిన్నారి మృతి
“పది నిమిషాలు అయింది.. నా బిడ్డకు ఆక్సిజన్ కూడా పెట్టలేదు” అంటూ షారుఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన బిడ్డను ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. చివరకు ఆర్యన్ ఆసుపత్రి బెడ్డు కూడా అందుకోకుండానే మృతిచెందాడు.
ఫ్లోర్‌పైనే పడిపోయి తండ్రి రోదనలు
ఆ సంఘటన తర్వాత షారుఖ్ ఆస్పత్రి ఫ్లోర్‌పైనే కుప్పకూలి ఏడవడం అందరి మనసును కదిలించింది. అక్కడి నుంచి ఓ వ్యక్తి ఆ దృశ్యాలను వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఆస్పత్రి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనతో ఆసుపత్రి వర్గాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆరోగ్యవ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని నెటిజన్లు అంటున్నారు. చిన్నారి ప్రాణం పోవడం ఏ ఒక్కరి గుండెను కలచివేయకుండా ఉండదు.
Read Also : Pawan Kalyan : ఏపీలో అభివృద్ధి దూరమై శాంతిభద్రతలు క్షీణించాయి: పవన్‌కల్యాణ్