ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన లాసెట్ (LAWCET) పరీక్ష ఫలితాల్లో టీడీపీ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (Tangirala Sowmya) తన ప్రతిభను చాటారు. ఆమె మొత్తం 95 మార్కులు సాధించి 739వ ర్యాంకు పొందారు. రాజకీయాల మధ్యన ఉన్న ఒత్తిడిలోనూ, ప్రజాసేవ చేస్తూనే విద్యపై ఆసక్తితో LAW పరీక్ష రాయడం, మంచి ర్యాంకు సాధించడంపై ఆమెను పలువురు అభినందిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నపటికీ, వ్యక్తిగత అభివృద్ధికి కూడా సమయాన్ని కేటాయించడంలో సౌమ్య అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తండ్రి ఆకస్మిక మరణం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశం
తంగిరాల సౌమ్య రాజకీయాల్లోకి ప్రవేశం ఒక విషాద సందర్భం తర్వాత జరిగింది. ఆమె తండ్రి తంగిరాల ప్రభాకర్ రావు ఆకస్మికంగా మృతి చెందిన నేపథ్యంలో, కుటుంబ వారసత్వాన్ని కాపాడేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో జరిగిన ఉపఎన్నికల్లో 74,827 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి తొలి సారి నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తున్నారు.
విద్యతో కూడిన సేవా దృక్పథం
తాజాగా లాసెట్ ఫలితాల్లో తంగిరాల సౌమ్య మెరుపు ప్రదర్శన ఆమె బహుముఖ ప్రతిభను వెల్లడిస్తుంది. రాజకీయ నాయకురాలిగా ప్రజల సమస్యలు పరిష్కరించడంలోనూ, వ్యక్తిగతంగా అభ్యాసం కొనసాగించడంలోనూ సమతౌల్యాన్ని నిలుపుతున్న విధానం యువతకు ప్రేరణగా మారుతుంది. విద్యకు ఇచ్చే ప్రాధాన్యత, సామాజిక సేవకు చూపే నిబద్ధత ఆమె రాజకీయ జీవితాన్ని మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Metro Phase-2 : మెట్రో ఫేజ్-2కు అనుమతులివ్వండి – సీఎం రేవంత్