హైదరాబాద్ (Hyderabad) నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ, ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో రోజూ అనుభవించే ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మరో కీలక అడుగు పడింది. గచ్చిబౌలి – కొండాపూర్ (Gachibowli – Kondapur) మధ్య నిర్మించిన ఫ్లైఓవర్ (Flyover) ప్రారంభానికి తుది ముహూర్తం ఖరారైంది. జూన్ 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.

శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ ప్రత్యేకతలు
ఈ ఫ్లైఓవర్ కు దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్ల పొడవుతో, 6 లేన్లతో విస్తరించి ఉంది. దీని నిర్మాణానికి సుమారు 178 కోట్లు ఖర్చయింది. ఇది శిల్ప లేఅవుట్ ఫేజ్-1 మరియు గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్‌లకు అనుసంధానంగా పనిచేస్తూ, ట్రాఫిక్ రద్దీని మరింతగా తగ్గించనుంది.
ట్రాఫిక్ కష్టాలకు చెక్
ట్రాఫిక్ కష్టాలకు చెక్ ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మించిన మూడవ ఫ్లైఓవర్. ఇప్పటికే ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, శిల్ప లేఅవుట్ ఫేజ్ వన్ ఫ్లైఓవర్ ఉండగా ప్రస్తుతం శిల్పా లే అవుట్ ఫేజ్ టు ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఇది అందుబాటులోకి వస్తే ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి.
సుందరీకరణతో ఆకర్షణ
ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన చివరి దశ పనులు, పూర్తి, కొనసాగుతున్న సుందరీకరణ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్. హఫీజ్ పేట వైపు వెళ్లే వాహనదారులకు ఈ ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఏర్పడే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
హఫీజ్‌పేట, కొండాపూర్, గచ్చిబౌలి మార్గాల కోసం కీలకం
ఈ ఫ్లైఓవర్ ముఖ్యంగా హఫీజ్‌పేట నుంచి గచ్చిబౌలి, కూకట్‌పల్లి నుండి మాదాపూర్, మరియు కొండాపూర్ నుండి ఐటీ కారిడార్ వైపు వెళ్లే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్‌లు తగ్గడంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
Read also: Hyderabad: దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య