ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం (Liquor scam) కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy) పై అధికార యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. ఆయనను ఇటీవల బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.

విజయవాడకు తరలింపు, విచారణ
చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడుకు ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్ నాయుడులను బెంగళూరు నుంచి విజయవాడకు తీసుకువచ్చిన సిట్ అధికారులు తమ కార్యాలయంలో నిన్న మూడు గంటలకు పైగా విచారించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఈ కేసుకు సంబంధించి పలు ముఖ్యాంశాలను పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో పలు నియోజకవర్గాలకు పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో చెవిరెడ్డితో పాటు వెంకటేశ్ నాయుడుకు జులై 1 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
విజయవాడ జిల్లా జైలుకు తరలింపు
రిమాండ్ ఉత్తర్వులు వచ్చిన వెంటనే సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కరెడ్డి, వెంకటేశ్ నాయుడు ఇద్దరినీ విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇకపోతే ఈ కేసులో మరిన్ని కీలక నేతలు, మద్య కాంట్రాక్టర్ల ప్రమేయం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
Read also: PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులుకు హైకోర్టులో లభించిన ఊరట