దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) నష్టాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఉదయం 9.19 సమయంలో సెన్సెక్స్ (Sensex) 200 పాయింట్లు పతనమై 81,244 వద్ద, నిఫ్టీ (Nifty) 57 పాయింట్లు తగ్గి 24,754 వద్ద ట్రేడవుతున్నాయి. సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా, మెట్రోపోలీస్ హెల్త్‌కేర్, ఏషియన్ ఇండియా గ్లాస్, స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్, వరుణ్ బేవరేజస్, ఆస్ట్రాజెనికా ఫార్మా, ఫ్యూజన్ ఫైనాన్స్ నష్టాల్లో మొదలయ్యాయి. రియాల్టీ, ఎనర్జీ, పీఎస్‌యూ రంగాల సూచీలు పుంజుకోగా.. మెటల్, ఆటో, పవర్, టెలికం సూచీలు కుంగాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో
ఆసియా పసిఫిక్ మార్కెట్లలోని ప్రధాన సూచీలు మొత్తం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. షాంఘై 0.86, జపాన్ నిక్కీ 0.71, హాంకాంగ్ హెచ్ఎస్ఐ 1.85, దక్షిణ కొరియా కోస్పీ0.26, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.03 శాతం నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడి 86.53 వద్ద మొదలైంది. నిన్న సాయంత్రం రూ.86.48 వద్ద ముగిసింది.
ఫెడ్ రిజర్వ్ కీలక నిర్ణయం
అమెరికా (America)కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్.. అంచనాలకు తగ్గట్లుగానే కీలక రేట్లను వరుసగా నాలుగో సమీక్షలోనూ యధాతథంగా కొనసాగించింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో, కీలక వడ్డీ రేటును మార్పు లేకుండా 4.25-4.5 శాతం వద్దే ఉంచింది. దీర్ఘకాలంలో గరిష్ఠ ఉపాధి సాధించేందుకు, ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లోపునకు తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం ఫెడ్ వెల్లడించింది.

SEBI తాజా నిర్ణయం
ప్రభుత్వానికి 90%, అంతకుమించి వాటా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) షేర్లను స్టాక్‌ఎక్స్ఛేంజీల నుంచి స్వచ్ఛందంగా డీలిస్టింగ్ చేసుకునేందుకు ప్రత్యేక చర్యలను సెబీ (Sebi) చేపట్టింది. డీలిస్టింగ్ ప్రక్రియకు మూడింట రెండొంతుల మంది ప్రజా వాటాదార్లు ఆమోదం తెలపాలనే నిబంధన నుంచి వీటికి సడలింపును ఇచ్చింది.
Read Also: Satellite internet: మొబైల్ కనెక్టివిటీ లేని ప్రాంతాలకు శాటిలైట్