ఏలూరు: ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ (Oil farm) సాగు పెద్దఎత్తున ప్రోత్సహించే దిశగా ఈఏడాది 15 వేల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పంట విస్తరించాలనే లక్ష ్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి నాదెండ్ల మనోహార్ (Nadendla Manohar) తెలిపారు. బుధవారం పెదవేగిలోని ఇండియన్ ఇస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు, రైతులు మరియు ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రోసెసర్లతో ఆయిల్ ఫామ్ పరిశోధనా, అభివృద్ధి కార్యకలాపాలను మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షి ంచారు.

అంతర్ పంటలపై అవగాహన
కొత్త అధిక దిగుబడినిచ్చే రకాలు, కోకో వంటి అంతర్ పంటల అవగాహన డెల్టా భూముల్లో ఆయిల్ ఫామ్ ప్రోత్సహించడం వరి, పొగాకు, తదితర పంటల నుండి పంట వైవిద్యీకరణ ఆయిల్ పామ్ యాంత్రీకరణను ప్రోత్సహించడం మొదలైన వాటిపై సమావేశంలో సమీక్షి ంచారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోనే పెదవేగిలోని ఆయిల్ పామ్ పరిశోధనా కేంద్రం ఉన్నతమైన స్థానంలో ఉందన్నారు. ఈ కేంద్రం ద్వారా అనేక మంది రైతులకు ఆయిల్ ఫామ్ ప్రొసెసర్లకు ఎంతగానో ఉపయోగపడు తుందన్నారు. ఈ కేంద్రంలో దాదాపు 29 మంది శాస్త్రవేత్తలు ఉన్నారన్నారు. చక్కటి మౌలిక సదుపాయాలతో ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా పెదవేగి మండలంలో 250 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట పరిశోధన, టిష్యూకల్చర్ తదితర జరుగుతున్నాయన్నారు. ఇక్కడ రైతాంగానికి ఎక్కువ దిగుబడులు వచ్చే ప్రక్రియను, వివిధ పరిశోధనలను సంస్థ డైరెక్టర్ డా. కంచర్ల సురేష్ లోతుగా వివరించడం జరిగిందన్నారు. ప్రధానంగా ఉన్న 5 కంపెనీల ప్రతినిధులతో, శాస్త్రవేత్తలతో సుదీర్ఘంగా ఆయిల్ ఫామ్ పంటసాగుపై సమీక్షి ంచడం జరిగిందన్నారు. రైతాంగం పంటసాగులో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామన్నారు. అభివృద్ధిలో జిల్లాను 5వ స్థానం నుంచి 3 వ స్థానంకు తీసుకువెళ్లేందుకు కృషిచేస్తున్నా మన్నారు. జిడిపి పెరిగేందుకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంట మరింత విస్తరించాలని, రైతులను ప్రోత్సహించే విషయంపై గౌ. ముఖ్యమంత్రి సమక్షంలో అనేక సందర్భాల్లో చర్చించడం జరిగిందన్నారు.
ఈఏడాది 5 వేల హెక్టార్ల నుండి 15 వేల హెక్టార్లకు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలని టార్గెట్ గా నిర్ణయించామన్నారు. దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రబాకర్ ఆయిల్ ఫామ్ పంటసాగులో పంట సమస్యలను వివరించారని, డెల్టా ప్రాంతంలో కూడా ఆయిల్ ఫామ్ పంట సాగును ప్రోత్సహించేందుతు అంశాలు చర్యలు తీసుకోవాలని కోరారన్నారు. పంటసాగులో రైతులు ఎదుర్కొంటున సమస్యల పరిష్కారంలో, క్షేత్రస్థాయిలో వాస్తవ సమాచారం అందరితో పాలుపంచుకోవడంలో కొంత జాప్యం కనబడుతుందన్నారు. దీనిని పరిష్కరించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయిలో మోనాటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు
రైతు సహాయకేంద్రంలో సిబ్బంది, క్షేత్రస్థాయిలో పర్యటించే హార్టికల్చర్ ఫీల్డ్ విస్తర్ణాధికారులతో పాటు ప్రధానమైన 5 ప కంపెనీల ప్రతినిధులు పెదవేగి ఆయిల్ ఫామ్ పరిశోదన కేంద్రం సహకారంతో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించా మన్నారు. ప్రతినెలా ఒక సమావేశం ఏర్పాటుచేసి సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పురుగుల నివారణకు ఎటువంటి ఎరువులు వినియోగించాలి, డ్రిప్ ఇరిగేషన్ తదితర అంశాలపై కూడా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం చాలా దారుణంగా ఆయిల్ ఫామ్ కు ఒక రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని, అదే విధంగా ఆయిల్ ప్రొడ్యూసర్లను కూడా మోసం చేసి సుమారు రూ.54 కోట్లు. బకాయిలు పెట్టిందని ఈ విషయాన్ని ముఖ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఎంతవరకు ప్రభుత్వం తరపున నిలబడగలమో పరిశీలిస్తా
మన్నారు.
Read also: Chandrababu Naidu : పన్ను వసూళ్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ..