భారత సాంకేతిక రంగంలో మరో పెద్ద ముందడుగుగా క్వాంటమ్ కమ్యూనికేషన్ (Quantum Communication) నిలిచింది. భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన సమాచారాన్ని సంపూర్ణ రహస్యంగా, హ్యాకింగ్(Hacking)కు అందకుండా పంపే సామర్థ్యం ఈ టెక్నాలజీలో ఉంది. దీంతో భారత సైనిక వ్యవస్థ, జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని అత్యంత సురక్షితంగా మార్పిడి చేయడం సాధ్యమవుతుంది. ఇదే రీతిలో ఇది భవిష్యత్తులో సమాచార రంగాన్ని పూర్తిగా మార్చేసే గేమ్ ఛేంజర్‌గా మారనుంది.
వైర్ల లేని కమ్యూనికేషన్
క్వాంటమ్ కమ్యూనికేషన్‌లో ఫ్రీ స్పేస్ ట్రాన్స్‌మిషన్ ఉండడం మరో ముఖ్యమైన అంశం. దీనివల్ల కేబుళ్లు, వైర్లు అవసరం లేకుండానే సమాచార మార్పిడి జరగవచ్చు. ముఖ్యంగా భూమిపైని భవనాలు, శాటిలైట్‌ల మధ్య కమ్యూనికేషన్‌ను ఇది విప్లవాత్మకంగా మార్చగలదు. తద్వారా రక్షణ రంగంతో పాటు అంతరిక్ష పరిశోధన, హైసెక్యూరిటీ డేటా కమ్యూనికేషన్‌లో కూడా ఇది కీలకంగా మారనుంది.
భారత సాంకేతికతకు ప్రపంచ గుర్తింపు
ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఢిల్లీ ఐఐటీ కలిసి ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించడంతో భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. ఈ టెక్నాలజీతో భారతదేశం అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీలో ముందంజ వేసింది. ఇది దేశ భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు కీలక సాంకేతిక నాయకత్వం సాధించే అవకాశాలు ఈ టెక్నాలజీతో మరింత పెరిగాయి.
Read Also : Quantum Communication : క్వాంటమ్ కమ్యూనికేషన్లో భారత్ సక్సెస్!