టీమిండియాలో (In Team India) ఓ కొత్త శకానికి నాంది పలికే సిరీస్ ఇది. ఇంగ్లండ్‌తో జరిగే ప్రతిష్టాత్మక 5 టెస్టుల సిరీస్ కోసం గిల్ నేతృత్వంలోని యువ టీమ్ ఇండియా తీవ్రంగా ప్రిపేర్ అవుతోంది. నెట్ సెషన్లలో రెట్టింపు శ్రమ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. జట్టుకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, గిల్-పంత్‌ను (Virat Kohli, Gill-Pant) ప్రత్యేకంగా కలిసినట్టు సమాచారం.లండన్‌లోని కోహ్లీ నివాసానికి గిల్, పంత్‌తో పాటు కొందరు భారత ఆటగాళ్లు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ వారికి విరాట్ ప్రత్యేక విందు ఇచ్చాడట. డిన్నర్ అనంతరం గిల్, పంత్‌తో విరాట్ దాదాపు రెండు గంటల పాటు మాట్లాడినట్టు సమాచారం. ఈ చర్చలో స్ట్రాటజీ, కెప్టెన్సీ చిట్కాలు ప్రధాన అంశాలుగా నిలిచినట్టు వినిపిస్తోంది.
జట్టు నాయకత్వంపై విరాట్ సూచనలు?
ఇండియా ఎ, ఇండియా మధ్య ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ సమావేశం జరిగిందట. ముఖ్యంగా ఇంగ్లండ్‌ను ఎలా ఎదుర్కోవాలి, టాప్ ఆర్డర్‌ను ఎలా నిర్వహించాలి, దూకుడుగా ఆడే బెన్ స్టోక్స్ సేనకు ఎలాంటి వ్యూహాలతో ఎదురుదెబ్బ ఇవ్వాలో విరాట్ వివరించాడట. పైగా, సారథిగా గిల్ ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, పంత్ ఎలా స్పందించాలి అనే అంశాలపై ప్రత్యేక సూచనలు చేశాడని సమాచారం.
లండన్‌కు ప్రేమ.. కోహ్లీ సరిగా ఇండియాకే రావడంలేదు?
ఇటీవల విరాట్ కోహ్లీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నప్పటికీ, టీమ్ ఇండియాతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఐతే, సిరీస్ సమయంలో భారత్‌కి వచ్చిన అతడు, మ్యాచ్‌లు పూర్తికాగానే వెంటనే లండన్‌కు తిరిగి వెళ్తున్నాడు. అనుష్క శర్మ, పిల్లలతో కలిసి లండన్‌నే నివాసంగా ఎంచుకున్నాడని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : T20 Cricket : ఉత్కంఠభరిత పోరులో చివరకు నెదర్లాండ్స్ విజయం