ప్రపంచవ్యాప్తంగా పలువురు జోస్యగాళ్లలో బాబా వంగా (Baba Vanga) పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆమె చెప్పిన అనేక జోస్యాలు నిజం కావడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఇప్పుడు మరోవైపు ‘న్యూ బాబా వంగా’గా గుర్తింపు పొందిన జపాన్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి చేసిన జోస్యం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.రియో టాట్సుకి తన పుస్తకం (The Future I Saw) లో చేసిన జోస్యం ప్రకారం, జూలై 5న జపాన్ తీరాలను భారీ సునామీ ముంచే ప్రమాదం ఉందట. ఫిలిప్పీన్స్, జపాన్ మధ్య సముద్రగర్భంలో (Under the sea)టెక్టానిక్ ప్లేట్లు కదలడం లేదా అగ్నిపర్వత పేలుడు వల్ల ఈ విపత్తు సంభవించవచ్చని ఆమె పేర్కొన్నారు.ఆమె కలల్లో సముద్రంలోని గాలి బుడగలు పైకి వస్తున్న దృశ్యాలు కనిపించాయని, ఇది భారీ భూకంపానికి సంకేతమని పేర్కొన్నారు.
విమాన టిక్కెట్ల బుకింగ్‌లపై తీవ్ర ప్రభావం
ఈ జోస్యం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జపాన్‌కి వెళ్లే పర్యాటకులు వెనక్కి తగ్గుతున్నారు. టూరిజం పరిశ్రమపై పెద్దదెబ్బ పడింది.జపాన్‌కు విమాన బుకింగ్‌లు 83% తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.బోయింగ్ విమానాల్లో 15–20% మంది ఇప్పటికే టికెట్లు రద్దు చేసుకున్నారు.హాంగ్‌కాంగ్, థాయిలాండ్, వియత్నాం బుకింగ్‌లు కూడా భారీగా పడిపోయాయి.హోటల్ బుకింగ్‌లు సగం వరకు తగ్గిపోయాయని బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది.
జపాన్‌కు చెందిన ఓ ఎయిర్‌లైన్ జనరల్ మేనేజర్ హిరోకి ఇటో మాట్లాడుతూ, తాము 80 శాతం సీట్లు భర్తీ అవుతాయని ఊహించామని కానీ కేవలం 40 శాతం రిజర్వేషన్లే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పుకార్లను నమ్మకండి: అధికారుల విజ్ఞప్తి
జపాన్‌లోని మియాగి ప్రిఫెక్చర్ గవర్నర్ యోషిహిరో మురై స్పందిస్తూ, ప్రజలు ఈ పుకార్లను నమ్మవద్దని సూచించారు. జపనీయులు తమ దేశాన్ని వదిలిపెట్టడం లేదని, తాము నిర్భయంగా ఉన్నామని తెలిపారు. ప్రయాణికులు తమ ప్లాన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు.రియో టాట్సుకి గతంలో అనేక సంచలనాత్మక జోస్యాలు చెప్పి అవి నిజమయ్యాయి.
2011లో జపాన్‌లో వచ్చిన తోహోకు సునామీ
ఫుకుషిమా అణు ప్రమాదం
యువరాణి డయానా మరణం
ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం
కొవిడ్-19 మహమ్మారి
ఇవన్నీ ఆమె ముందుగానే అంచనా వేసినవే. ఈమె జోస్యాలకు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, ఆమె చెప్పిన విషయాలు నిజమవ్వడమే విశ్వాసానికి కారణమవుతోంది.టాట్సుకి తన పుస్తకంలో మరో సంచలన జోస్యం కూడా చెప్పారు. 2030లో కొవిడ్ మహమ్మారి మరోసారి తిరిగి వస్తుందని, ఈసారి మరింత ప్రాణాంతకంగా ఉంటుందని హెచ్చరించారు.
Read Also : Iran Israel War: ట్రంప్ హెచ్చరికతో చమురు ధరలకు రెక్కలు!