కళ్యాణప్రదం
వాస్తు, జ్యోతిష్యం ప్రకారం తూర్పు దిక్పాలకుడు ఇంద్రుడు. తూర్పు దిగృతి శుక్రుడు. దక్షిణం దిగ్పతి యముడు. దక్షిణ దిక్పాలకుడు కుజుడు. ఆగ్నేయంలో దిగ్పతి చంద్రుడు. ఆగ్నేయ దిక్పాలకుడు అగ్నిదేవుడు. ఇంద్రునికి, శుక్రుడికి, యమధర్మరాజుకి, అగ్నిదేవుడికి, చంద్ర గ్రహానికి, కుజ గ్రహానికి, ఇద్దరు వ్యక్తుల వివాహ బంధం విషయంలో, చాలా దగ్గర ‘కారకత్వ సంబంధం’ ఉంటుంది. ఈ రెండు దిక్కులు (తూర్పు, దక్షిణం దిక్కులు) కలిసే మూల ఆగ్నేయం. అంటే అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేసే చిన్న ప్రయత్నాలు కూడా కళ్యాణప్రదంగా గొప్ప ఫలితాలను ఇస్తాయి. వీరి అనుగ్రహంతో జరిగే వివాహాలు సకల సంపదలతో సత్సంబంధాలుగా కలకాలం నిలబడేటట్టుగా ఎక్కువ అవకాశాలు ఏర్పడతాయి.

మంచి సంబంధాల కోసం ఆగ్నేయ ప్రసన్న ప్రక్రియ
పెళ్లిచూపుల రోజున ఆగ్నేయంలో చేయవలసిన ఒక చిన్న ప్రక్రియ ఉంటుంది. పొద్దున్నే స్నానం చేసి శుచిగా ఈ ప్రక్రియ చేయండి. పెళ్లిచూపులు ఎవరికైతే జరుగుతున్నాయో ఆ అబ్బాయి అయినా/అమ్మాయి అయినా సరే వాళ్లే చేయటం శ్రేష్టం. వాళ్ల వల్ల కానప్పుడు వాళ్లకు సంబంధించిన రక్త సంబంధీకులు, లేదా పెద్దలు ఈ పని చేయటం ద్వితీయ శ్రేష్టం. ఇంటిలోపల, ఆగ్నేయ మూలన ఈ పని చేయవలసి ఉంటుంది. సాధారణంగా ఇంటికి ఆగ్నేయంలో వంటగది ఉంటుంది. అక్కడ ఆగ్నేయంలో (అలా కాకుండా అక్కడ ఇంకేదో.. బెడ్రూమ్ ఉంటే- ఆ రూమ్‌లోనే ఆగ్నేయ మూలలో) ఒక బర్నర్ గానీ, స్టవ్ నీ వెలిగించండి. ఆవుపాలు పోసిన గిన్నెను స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు స్టవ్. ఆ పాలు పొంగిపోవడం మీరు చూడాలి. అప్పుడు ఆ పాలతో ఏదైనా తీపి వంటను చేయండి. తాటిబెల్లం ప్రధానం. అది దొరకనప్పుడు మామూలు బెల్లం లేదా పంచదారను ద్వితీయ ప్రాధాన్యంగా వాడవచ్చు ఆ వంట పరమాన్నం కావచ్చు, సేమ్యా కావచ్చు, రవ్వకేసరి కావచ్చు. చక్కగా డ్రైఫ్రూట్స్ వేసి రుచిగా వంట చేయండి. దాన్ని ఒక చిన్న గిన్నెలో లేదా ఆకుదొప్పలో గానీ పెట్టి ఇంట్లో మీరు ప్రతిరోజూ పూజలు చేసే చోట దీపారాధన చేసి, ఈ తీపి వంటకాన్ని నైవేద్యంగా హారతితో సమర్పించండి. పెళ్లిచూపులు జరిగే రోజున పొద్దున, మధ్యాహ్నం లేక సాయంత్రం ఎప్పుడు ఉన్నా సరే, మీరు ఈ ఆగ్నేయ ప్రక్రియను, నైవేద్య సమర్పణ పనిని వీలైనంత పొద్దున్నే శుచిగా చేయాలి.

సంబంధం కుదరాలంటే?
అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఇంట్లో ఈ ప్రక్రియ చేసుకున్న తర్వాత పెళ్లిచూపులకి రెడీ అవ్వండి. పెళ్లిచూపులు సాధారణంగా అమ్మాయివాళ్ల ఇంట్లో జరుగుతాయి. ఏదైనా గుడిలో ఏర్పాటు చేస్తారు. లేదా ఏదైనా రెస్టారెంట్లో మీ ఇద్దరికీ ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయవచ్చు. ఉత్సాహంగా.విచక్షణతో మెలగండి.
అంతే! అయితే ‘ఈ మీకు కుదురుతుంది’ అని నేను చెప్పటం లేదు. ఒకవేళ అది మీకు తగిన సంబంధం కాకపోతే, మీ ఇద్దరికీ కుదరని స్వభావాలు ఉన్నట్లయితే తర్వాత విడిపోయి బాధ పెట్టేది, మోసపూరితమైనది అయితే ఆ సంబంధం మీకు కుదరదు. మీరు వారికి నచ్చకపోవచ్చు. లేదా వారు మీకు నచ్చకపోవచ్చు. సంబంధం వీగిపోతుంది. విచారించనవసరం లేదు. అది మీ అభిరుచికి తగిన మంచి సంబంధం అయితే మీ అన్యోన్య దాంపత్యానికి పునాది.వేసేదైతే, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ కలకాలం నిలువగలిగేదైతే తప్పకుండా కుదురుతుంది. పెళ్లిచూపులు పెట్టుకున్న ప్రతిసారీ ఈ ప్రక్రియ మీరు చేయండి. కొన్ని సంబంధాలు తప్పిపోవచ్చు. అది మీ మంచి కోసమే అని గ్రహించండి. కానీ ఈ ప్రక్రియ వలన మీకు మంచి సంబంధమే నిలుస్తుంది.

విడాకులు తీసుకున్న వాళ్లకోసం
ఇదివరకే పెళ్ళిళ్లు అయి, బాధలు పడి, విడాకులు తీసుకున్నవాళ్లు ఈసారి ఒక మంచి సంబంధం కావాలనుకుంటే ఈ ప్రక్రియను చేయండి. ఇంతకు ముందులా కాకుండా, ఈసారి మంచి సంబంధం దొరుకుతుంది. ఆనందంగా సంబంధం తప్పకుండా జీవితాన్ని ఆస్వాదించండి