మంచు విష్ణు (Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) తాజాగా వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలపై బ్రాహ్మణ చైతన్య వేదిక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హిందూ ధార్మిక భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నట్లు వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మూవీని సెన్సార్ బోర్డు ప్రివ్యూలో చూసింది.
సెన్సార్ బోర్డు సభ్యుల అభిప్రాయాలు
తాజాగా ‘కన్నప్ప’ చిత్రం చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు, 13 సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. చిత్రంలోని కొన్ని డైలాగులు, విజువల్స్ హిందూ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నట్లు వారు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై సంపూర్ణంగా సమీక్ష చేసిన తర్వాతే సినిమాకు అనుమతినిస్తామని బోర్డు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు సర్టిఫికెట్ జారీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
రిలీజ్‌పై అనిశ్చితి – ఫ్యాన్స్ లో ఆందోళన
ఇప్పటికే జూన్ 27న విడుదలకు ప్లాన్ చేసిన ఈ సినిమా పై ఇప్పుడు విడుదల తేదీ విషయంలో అనిశ్చితి నెలకొంది. సెన్సార్ అనుమతి లేకుండా సినిమా విడుదల చేయడం సాధ్యపడదు కాబట్టి, చిత్రబృందం ఇప్పుడు బోర్డు సూచించిన మార్పులు చేసేందుకు సిద్ధమవుతుందా? లేక వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందా? అనేది చూడాలి. మరోవైపు మంచు విష్ణు అభిమానులు సినిమాపై సెన్సార్ అభ్యంతరాల వల్ల వాయిదా పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.