భారత కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు మొహమ్మద్ అసదుద్దీన్ (Mohammad Asaduddin) రాజకీయాల్లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వం ఇటీవల ప్రకటించిన 69 మంది ప్రధాన కార్యదర్శుల జాబితాలో అసదుద్దీన్‌కు స్థానం లభించడం విశేషం. గతంలో యూత్ కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన, ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు.
క్రికెట్ నుంచి రాజకీయాల దిశగా మారిన ప్రయాణం
మొహమ్మద్ అసదుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ వారం ప్రారంభంలో కాంగ్రెస్‌కు పార్టీ నాయకత్వం నియమించిన 69 మంది ప్రధాన కార్యదర్శులలో భారత మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు మొహమ్మద్ అసదుద్దీన్‌కు కూడా చోటు దక్కింది. దీంతో అతను అధికారికంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. అసదుద్దీన్ తొలుత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకొని.. రంజీ వరకు ఆడాడు. ఇప్పుడు రాజకీయ రంగంలోకి ప్రవేశించాడు.
జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశమా?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు జరుగనున్న ఉప ఎన్నికల్లో అసదుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అసదుద్దీన్ తండ్రి గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు కానీ, పార్టీకి భారీ ఓటింగ్ శాతం తీసుకొచ్చారు.
ప్రత్యక్ష పాలకుడిగా మారే దిశగా ముందడుగు
అసదుద్దీన్, తన తండ్రి ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాడు, నియోజకవర్గం అంతటా ర్యాలీలు, మొహల్లా సమావేశాలు నిర్వహించాడు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందే ముందు, అసదుద్దీన్ తెలంగాణలో యూత్ కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ కార్యదర్శిగా పనిచేశారు. అసదుద్దీన్ లా డిగ్రీ పూర్తి చేశాడు. అలాగే భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జాను వివాహం చేసుకున్నాడు.
Read also: Ponguleti Srinivas Reddy: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన