తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ అభివృద్ధికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards) వేడుకలో ఆయన మాట్లాడారు.1964లో ప్రారంభమైన నంది అవార్డులను గుర్తు చేశారు సీఎం. అప్పుడు అక్కినేని మొదటి అవార్డు అందుకున్నారు. ఇప్పుడు అదే తీరులో గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.ఈ ఆలోచనను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో దిల్ రాజు కీలక పాత్ర వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను అభినందించారు.తెలుగు సినిమా ఇప్పుడు దేశానికే చిరునామా అయ్యిందన్నారు. హైదరాబాదు ఆ కేంద్రంగా నిలిచిందని చెప్పారు. బాలీవుడ్ కంటే తెలుగు సినిమా ముందంజలో ఉందని తెలిపారు.
సినీ రంగాన్ని “విజన్ 2047″లో భాగం చేస్తాం
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నారు. అందులో సినీ రంగం కీలక పాత్ర పోషించాలన్నారు. రాజమౌళిలాంటి దర్శకులు హాలీవుడ్‌ను ఇక్కడికే తేవాలన్నారు.
సినీ ప్రముఖులకే బాధ్యత అంటారు సీఎం
విజన్ 2047లో సినీ రంగానికి ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. దాన్ని రచించాల్సిన బాధ్యత సినీ ప్రముఖులదే అన్నారు. తాను ఎంతకాలైనా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.గత విభేదాలన్నీ పక్కనపెట్టి కలసి ముందుకెళ్లాలని సూచించారు. కళే ప్రజలకు చైతన్యం ఇస్తుందన్నారు. బాలకృష్ణ చెప్పిన మాటలను ఉదహరించుతూ కళ గొప్పతనాన్ని వివరించారు.ఆస్కార్ విన్నర్ రాహుల్‌ను ప్రోత్సహించాలని సీఎం భట్టికి సూచించారు. గద్దర్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Read Also : Pawan Kalyan : వీరజవాన్ కుటుంబానికి పవన్ ఆర్ధిక సాయం ఎంతంటే?