భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi) నేటి నుంచి ఐదు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మోదీ తొలి దశగా మిడిల్ ఈస్ట్ దేశమైన సైప్రస్‌ను సందర్శించనున్నారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం విశేషం. సైప్రస్‌తో ద్వైపాక్షిక సంబంధాల పెంపొందింపుపై ప్రధానంగా చర్చలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
G7 సదస్సుకు హాజరయ్యే ప్రధాని మోదీ
జూన్ 16, 17 తేదీల్లో కెనడా(Canada)లో జరుగుతున్న G7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారు. ఈ సదస్సుకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రత్యేకంగా మోదీని ఆహ్వానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై ఈ సదస్సులో నేతలు చర్చించనున్నారు. భారత్‌కు ప్రాధాన్యత కలిగిన అంశాలను మోదీ ముందుంచే అవకాశముంది.
అంతరాష్ట్ర సంబంధాల బలోపేతానికి ఒప్పందాలు
జూన్ 18న మోదీ క్రొయేషియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయా దేశాల ప్రభుత్వాలతో పలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారం, పెట్టుబడులు, టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక మార్పిడుల విషయంలో భారత్-విదేశీ దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ పర్యటన ద్వారా భారత్ స్థాయిని ప్రపంచంలో మరింతగా పెంచే అవకాశం కనిపిస్తోంది.
Read Also ; Fishing : నేటి నుంచి చేపల వేట పున:ప్రారంభం