తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Former Minister Harish Rao) మరోసారి ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు గోదావరి (Godavari) జలాలను అక్రమంగా తరలించడానికి కీలకంగా మారుతోందని అన్నారు.కృష్ణా నీటి తరలింపుకు పోతిరెడ్డిపాడు ఎలా ఉపయోగపడిందో, అదే విధంగా గోదావరి జలాల తరలింపుకు బనకచర్ల ప్రాజెక్టు వేదికవుతోంది, అని హరీశ్ రావు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం పనులను వేగంగా కొనసాగిస్తుంటే, తెలంగాణ మాత్రం నిశ్చలంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నెలాఖరునే ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలవబోతోంది. కానీ మన ప్రభుత్వం మాత్రం ఇంకా నిద్రపోతుంది, అని ఆయన ఎద్దేవా చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పుపడుతూ, ఆయన మాటలు కేవలం హాల్చాల్‌కే పరిమితమైపోతున్నాయని విమర్శించారు.
కేసులపై శ్రద్ధ.. నదులపై కాదు
కేటీఆర్‌పై కేసుల గురించి ప్రభుత్వం ఎంత శ్రద్ధగా ఉంది. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్? అని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రానికి ఏపీ ప్రాధాన్యం మాత్రమే
హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఏపీ కోణంలో చూడటం గమనార్హం అన్నారు. గత రెండు బడ్జెట్లను చూడండి. ఆంధ్రాకు నిధుల వర్షం పడింది. తెలంగాణ మాత్రం గుండు సున్నా! అని ఆయన ధ్వజమెత్తారు.తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులూ ఏమీ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.
ఇప్పటికైనా స్పందించండి, లేకపోతే పోరాటం ఖాయం
బాబ్లీ నీటి కోసం చంద్రబాబు ఒకప్పుడు పోరాడారు. ఇప్పుడు ఏకంగా 200 టీఎంసీల కోసం ఏపీ ప్రాజెక్టులు వేస్తోంది. తెలంగాణ ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? అని హరీశ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ఇప్పటికైనా కళ్లు తెరిచి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోండి. పోరాటానికి సిద్ధం అయితే, బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుంది. లేకపోతే, మేమే పోరాటానికి దిగుతాం, అని హెచ్చరించారు.
Read Also : Plane crash: కళ్లముందే ఘోరం.. కన్నీటితో టేకాఫ్: పైలట్ల ఆవేదన