అహ్మదాబాద్(Ahmedabad)లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియాకు చెందిన అహ్మదాబాద్-లండన్ విమానం అగ్నిగోళంగా మారి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో దాదాపు అందరూ మరణించగా, వీరిలో టీ కొట్టు వద్ద చెట్టు కింద నిద్రిస్తున్న 14 ఏళ్ల బాలుడు ఆకాశ్ పత్నీ ఒకడు కావడం అందరినీ కలచివేస్తోంది.
టేకాఫ్ కొద్దిసేపటికే మంటలు..
వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్(Ahmedabad)లోని మేఘానినగర్ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ సమీపంలో పత్నీ కుటుంబం టీ కొట్టు నడుపుతోంది. గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం కొద్ది సేపటికే అదుపుతప్పి, మంటల్లో చిక్కుకుని హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఆ సమయంలో టీ కొట్టు దగ్గర చెట్టు కింద ఆకాశ్ పత్నీ నిద్రిస్తున్నాడు.
పెద్ద లోహపు ముక్క తలపై..
“ముందుగా ఒక పెద్ద లోహపు ముక్క ఆకాశ్ (Akash) తలపై పడింది, ఆ తర్వాత మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఆకాశ్ తల్లి సీతాబెన్ టీ తయారుచేస్తోంది. కొడుకుని కాపాడేందుకు ప్రయత్నించి ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది” అని ఆకాశ్ అత్త చందాబెన్ కన్నీటిపర్యంతమయ్యారు. “ఆకాశ్ శరీరం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది అని ఆమె వివరించారు.

డెంటల్ సర్జరీ కోసం వచ్చిన కూతురు..
ఇలాంటిదే మరో హృదయ విదారక ఘటన ఆనంద్ పట్టణానికి చెందిన సురేశ్ మిస్త్రీది. ఆయన తన 21 ఏళ్ల కుమార్తె క్రీనా మిస్త్రీ మృతదేహం గుర్తింపు కోసం సివిల్ ఆసుపత్రి మార్చురీ వద్ద డీఎన్ఏ నమూనా ఇచ్చారు. క్రీనా (Krinaa) కూడా ఇదే విమానంలో ప్రయాణిస్తూ దుర్మరణం పాలైంది.
Read Also: Ruyangsurak: విమాన ప్రమాదాల్లో బయటపడిన ఇద్దరిదీ ఒకే సీట్