ఇరాన్-ఇజ్రాయెల్ (Iran Israel war)మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ (Israel ) చేసిన దాడులు సరైనవేనని ఆయన ప్రకటించారు. ఇరాన్ తమతో అణు ఒప్పందంపై ముందుకు రావలసిన అవసరం ఉందని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
అణు ఒప్పందానికి గడువు ఇచ్చాం – ట్రంప్
ఇరాన్‌తో అణు ఒప్పందానికి 60 రోజుల గడువు ఇచ్చామని, అది ముగిసిపోయినప్పటికీ ఇప్పటికీ ఇరాన్ స్పందించలేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఇవాళ 61వ రోజు కూడా పూర్తైంది. ఇరాన్ ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా డీలుపై సంతకం చేయాలి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని హెచ్చరించారు. ఈ ప్రకటనతో ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడి పెంచే ధోరణిని స్పష్టంగా ప్రదర్శించారు.
ఇజ్రాయెల్ చర్యలకు మద్దతుగా ట్రంప్
ఇజ్రాయెల్ దాడులపై అమెరికాకు ముందుగానే సమాచారం ఉందని ట్రంప్ తెలిపారు. అంతేగాక, ఈ దాడులు సరైన దిశలో ఉన్నాయని స్పష్టం చేశారు. “ఇరాన్ తన వైఖరిలో మార్పు తీసుకురావాల్సిన సమయం ఇదే. లేకపోతే ఇజ్రాయెల్ చర్యలు మరింత తీవ్రంగా మారతాయి. మేము మౌనంగా ఉండం,” అని అన్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలతో తాను ఇప్పటికీ గ్లోబల్ రాజకీయాల్లో ప్రాబల్యాన్ని కొనసాగిస్తున్నట్లు మరోసారి చాటిచెప్పారు.
Read Also : Gaddar Awards : ఉత్తమ హీరోకు ఎంత ఇస్తారంటే?