हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

PM Modi : విమాన ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

Shobha Rani
PM Modi : విమాన ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

గుజరాత్​ అహ్మదాబాద్‌(Ahmedabad)లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గురువారం మధ్యాహ్నం, అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే మేఘనీనగర్ ప్రాంతంలో కూలిపోయిన విషయం విదితమే.

Ahmedabad : విమాన ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ
Ahmedabad : విమాన ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

పలువురు ప్రముఖుల పరామర్శ..
అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్‌ (Ahmedabad) సివిల్‌ ఆసుపత్రికి వెళ్లారు మోదీ. విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అయితే ప్రధాని వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్‌ సంఘవి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధనఖర్, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నాయకులు సంఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి పరిహారం ప్రకటించే అవకాశం ఉంది.

ముకేశ్ అంబానీ దంపతుల విచారం
విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ దంపతులు సానుభూతి తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ రిలయన్స్‌ ప్రకటన విడుదల చేసింది. సాధ్యమైనంత వరకు అన్నివిధాలా సాయం చేయడానికి సిద్ధంగా ఉంది” అని ముకేశ్ దంపతులు వెల్లడించారు.

Read Also: Israel : ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ పేలుళ్లు..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870