తుమ్మల నాగేశ్వర్రావు లేఖ ఇవ్వడంతో ఉత్కంఠ
హైదరాబాద్ : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ వైఫల్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసిఘోష్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వర్రావును విచారణకు పిలిచే అంశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. పిసిఘోష్ శుక్రవారం హైదరాబాద్ నుంచి స్వస్థలంకు వెళ్ళి పోతుండటంతో ఆయన తిరిగి వచ్చాక ఇంకా ఎవరికైనా సమన్లు జారీచేసి విచారణచేస్తారా అనే అంశంపై అనిశ్చితి నెలకొంది.

కాళేశ్వరం కమీషన్ ఎదుట తన పేరును ఈటెల రాజేందర్ ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పిసిఘోష్ కమీషన్కు లేఖ రాశారు. తుమ్మడి హట్టి వద్ద నెలకొన్న అంశాలను అధ్యయనం కోసం అప్పటి సిఎం కెసిఆర్ హరీష్ రావు చైర్మన్గా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, తుమ్మలనాగేశ్వర్రావుతో ఒక సభ్కమిటీ వేశారు. ఈ అంశంను జస్టిస్ ముందు ఈటెల చెప్పడంతో తుమ్మల నాగేశ్వరావు క్యాబినెట్ సబ్కమిటీ అన్ని ప్రాజెక్టుల అధ్యయనం కోసమే కానీ కాళేశ్వరం కోసం కాదని దీనిపై ఈటెలపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజప్తిచేశారు. క్యాబినెట్ సబ్కమిటీ వేశారా లేదా అనే అంశంపై తుమ్మల నుంచి వాగ్మూలం తీసుకొంటేనే జస్టిస్ ఇచ్చే తుది నివేదికకు శాసనాత్మకత వస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
జస్టిస్ పిసిఘోష్ విచారణకు మంత్రి తుమ్మల
జస్టిస్ పిసిఘోష్ మంత్రి తుమ్మలను కూడా ఈ అంశంలో విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏదీ ఏమైనా క్యాబినెట్ సబ్ కమిటీ అంశం ఈటెల రాజేందర్ తెరపైకీ తేవడంతో జూలైలో 31తో ముగిసిపోనున్న పిసిఘోష్ కమిటీ కాలపరిమితిలో నివేదిక అందజేయడానికి వేగం పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఆనాటి ఆర్ధిక మంత్రి ఈటెలరాజేందరను, నీటిపారుదలశాఖ మంత్రులుగా వ్యవహరించిన హరీష్ రావును, మాజీ ముఖ్యమంత్రి కెసిఆరు విచారణ చేయడంతో దాదాపు కమీషన్ ఆఖరు ఘట్టంకు చేరుకొన్నప్పటికి తుమ్మలను విచారణకు పిలిచే అంశంతో ఈ విచారణ కాలపరిమితిలో అది సాధ్యమా కాదా అనే మీమాంస ఎదురవుతోన్నది. పిసిఘోష్ జూలై మొదటివారం హైదరాబాద్కు చేరుకోనున్నారు.
Read also: District In Charge : మంత్రి కొండా సురేఖ స్థానంలో వివేక్‌కు బాధ్యతలు