हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Chennai: దేశంలోనే తొలిసారి చెన్నైలో 8 అంతస్థుల భవనంలో మెట్రో రైలు

Sharanya
Chennai: దేశంలోనే తొలిసారి చెన్నైలో 8 అంతస్థుల భవనంలో మెట్రో రైలు

చెన్నై : దేశంలోనే మొట్టమొదటిసారిగా తొమ్మిది అంతస్థుల భవన సముదాయంలో నిర్మించే రైలు పట్టాలపై మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఈ అద్భుత దృశ్యం తిరుమంగళం మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఆవిష్కృతం కాబోతోంది. రాజధాని నగరం చెన్నైలో రెండో దశ మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా తిరుమంగళం వద్ద షాషింగ్ మాల్స్ తో కూడిన బహుళ అంతస్థుల భవన సము దాయం మధ్య నుంచి వెళ్లేలా మెట్రోరైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు.

Chennai: దేశంలోనే తొలిసారి చెన్నైలో 8 అంతస్థుల భవనంలో మెట్రో రైలు
Chennai: దేశంలోనే తొలిసారి చెన్నైలో 8 అంతస్థుల భవనంలో మెట్రో రైలు

ఈ కొత్త రైలు మార్గానికి సంబంధించిన తొమ్మిది అంతస్థుల భవన సముదాయం, టవర్ల ఊహాచిత్రాలను చెన్నై మెట్రో రైల్వే (సిఎంఆర్ఎల్) బుధవారం విడుదల చేసింది. నగరంలో రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టును 116.1 కి.మీ. వరకు మూడు మార్గాల్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో మాధవరం-షోళింగనల్లూరు మార్గంలోని తిరుమంగళం జంక్షన్ వద్ద మెట్రో రైల్వే స్టేషన్ తోపాటు షాపింగ్మాల్స్ 9 అంతస్థులతో ఎ, బి, సి పేర్లతో మూడు భవనాలు నిర్మించనున్నారు. ఈ భవన సముదాయంలో రెండంతస్థుల రైల్వే స్టేషన్ కూడా నిర్మితమవుతుంది.

మెట్రో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులకు టెండర్లు

ఈ భవన సముదాయాలతో కూడిన మెట్రో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులకు సంబంధించి త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నారు. కొత్తగా నిర్మించబోయే ఈ భవనంలో పలు కార్యాలయాలు, చిల్లర దుకాణాలు, మూడు సొరంగమార్గాల పార్కింగ్ స్థలాలుంటాయి. భారత దేశంలోనే వాణిజ్య సముదాయాలు కలిగిన భవనంలో ప్రయాణించేలా మెట్రో రైలు మార్గాన్ని నిర్మించడం ఇదే ప్రప్రథమనని మెట్రో రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జపాన్, చైనా దేశాల్లోనే భవన సముదాయాల మధ్య నుంచి రెళ్లు వెళుతున్నాయని, ఆ రీతిలోనే నగరంలోనూ బహళ అంతస్థుల భవన సముదాయంలోకి మెట్రో రైళ్లు దూసుకెళతాయని తెలిపారు. ఈ భవన సముదాయంలోని నాలుగో అంతస్థులో మెట్రో రైళ్లు ప్రయాణిస్తాయని, మూడో అంతస్థులో ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్ ఉంటాయని పేర్కొన్నారు.

Read also: PM Modi : నేడు అహ్మదాబాదు కు ప్రధాని మోదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870