అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లో 241 మంది ప్రాణాలు కోల్పోయిన వేళ, ఓ మహిళ మాత్రం కేవలం 10 నిమిషాల ఆలస్యంతో ఫ్లైట్ మిస్ కావడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భూమి చౌహన్ (Bhumi Chauhan) అనే మహిళ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా చేరారు. దీంతో ఆమె ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ను మిస్ అయ్యారు.
ఫ్లైట్ మిస్.. జీవితాన్ని మిగిల్చింది
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న భూమి చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా తో మాట్లాడుతూ, “ట్రాఫిక్ వల్ల నేను 10 నిమిషాల లేట్ అయిపోయాను. అప్పట్లో ఫ్లైట్ మిస్ అవ్వడం నా బాధగా అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే అదే నా జీవితాన్ని రక్షించింది” అని చెప్పుకున్నారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ఆమె సానుభూతిని తెలియజేశారు.
గణపతి దేవుడే నన్ను కాపాడారు
తనను ఈ ప్రమాదం నుంచి కాపాడినది గణపతి దేవుడేనని ఆమె పేర్కొన్నారు. “నేను వెకేషన్ కోసం వచ్చాను. కానీ ఇలా విమానం మిస్ కావడం నా జీవితం మొత్తాన్ని మార్చేసింది. దేవుడి దయ వల్లే నేను బతికినట్టయ్యింది” అని భూమి చౌహన్ చెప్పుకొచ్చారు. ఆమె అదృష్టకథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also : Ahmedabad Plane Crash : విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు కానీ…