బోయింగ్ 787-8 (Boeing 787-8 )డ్రీమ్ లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన శ్రేణిలో ఒకటి. ఇది అధునాతన టెక్నాలజీతో తయారైన వైడ్‌బాడీ విమానం. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంతో ఈ విమానంపై ప్రజల దృష్టి మళ్లింది. దీని పొడవు 56.72 మీటర్లు, ఎత్తు 16.92 మీటర్లు, రెక్కల పొడవు 60.12 మీటర్లుగా ఉంటుంది. ఫ్యూజలాజ్ వ్యాసం 5.94 మీటర్లు.
ప్రయాణికుల సామర్థ్యం, వేగం విశేషాలు
బోయింగ్ 787-8లో మొత్తం 252 సీట్లు ఉన్నాయి. దీని గరిష్ఠ గమనం వేగం గంటకు 903 కిలోమీటర్లు. దీని రేంజ్ అంటే ఒకసారి ఫ్యూయల్ నింపిన తర్వాత నిరాఘాటంగా ప్రయాణించగల దూరం 13,620 కిలోమీటర్లు. దీన్ని ఖండాంతర ప్రయాణాలకు అత్యుత్తమ ఎంపికగా భావిస్తారు. దీనిలో ప్రయాణికులకు అధిక సౌకర్యాలే కాకుండా, తక్కువ శబ్దంతో ప్రయాణించే వీలుంది.
ఇంజిన్, ఫ్యూయల్ సామర్థ్యం వివరాలు
ఈ విమానానికి రోల్స్ రాయిస్ ట్రెంట్ 1000 అనే శక్తివంతమైన ఇంజిన్ అమర్చారు. ఇది అధిక సామర్థ్యం కలిగిన టర్బోఫ్యాన్ ఇంజిన్. గరిష్ఠ టేకాఫ్ మాసు 2,27,930 కిలోగ్రాములు, మాక్సిమమ్ ఫ్యూయల్ సామర్థ్యం 1,01,323 కిలోగ్రాములు. ఈ ప్రత్యేకతలన్నీ బోయింగ్ 787-8ను ప్రస్తుతకాలంలో అత్యంత ఆధునిక విమానాల్లో ఒకటిగా నిలిపాయి. ఇందుకే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు దీన్ని వాణిజ్య ప్రయాణాల కోసం ఉపయోగిస్తున్నాయి.
Read Also : Ahmedabad Plane Crash : ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు