ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో (Lucknow) లోని లాల్‌పూర్ ప్రాంతంలో ఓ 16 ఏళ్ల బాలికపై జరిగిన ఘోర దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ‘మీ భర్త నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు’ అని నిజాన్ని చెప్పినందుకు తొలుత భర్తతో గొడవ పడిన సదరు మహిళ, ఆపై భర్తతో కలిసి బాలికపైనే దాడి చేసింది.
ఒంటరిగా ఉన్న బాలికపై కానిస్టేబుల్ వేధింపులు
లక్నోలోని లాల్‌పూర్ ప్రాంతంలో బాధితురాలు (16) తన కుటుంబంతో నివసిస్తోంది. వారి ఎదురింట్లో ఓ కానిస్టేబుల్, అతని భార్య (మహిళా కానిస్టేబుల్) ఉంటున్నారు. రెండు కుటుంబాలకూ ఒకే టాయిలెట్ ఉంది. ఈ క్రమంలో తాను ఒంటరిగా ఉన్నప్పుడు సదరు కానిస్టేబుల్ లైంగికంగా వేధించేవాడని, అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలు ఆరోపించింది. ఆ కానిస్టేబుల్ చాలా కాలంగా నన్ను చెడు దృష్టితో చూస్తున్నాడు. చాలాసార్లు నా దారికి అడ్డొచ్చి, చేయి పట్టుకుని అసభ్యంగా మాట్లాడాడు అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
మొదట భర్తను మందలించిన కానిస్టేబుల్ భార్య
సోమవారం ఈ వేధింపులు భరించలేక కానిస్టేబుల్ భార్యకు విషయం చెప్పింది. తొలుత తన భర్తతో గొడవపడిన భార్య, కొంత సమయం తర్వాత బయటకు వచ్చి, భర్తపై మొదట కోపం చూపించిన ఆమె, ఆ తర్వాత అతనితో కలసి బాలికను ఎదిరించారు. బాధితురాలు వాపోయింది.
రెండంతస్తుల భవనం పైనుంచి తోసివేత
కొంత సమయం తర్వాత బయటకు వచ్చి, రెండంతస్తుల భవనం పైనున్న కామన్ ఏరియాలో కూర్చున్న బాలికను ఆధారం చూపించమని డిమాండ్ చేసింది. ఆ తర్వాత దంపతులిద్దరూ కలిసి తనపై దాడి చేసి, భవనం పైనుంచి కిందకు తోసేశారని బాధితురాలు వాపోయింది.
బాలిక తండ్రిపై కూడా దాడి
బాలిక కిందపడి ఉండటం చూసిన ఆమె కుటుంబ సభ్యులు, తండ్రి పైకి వెళ్లి నిలదీయగా, కానిస్టేబుల్ దంపతులతో పాటు అక్కడకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ సోదరుడు కూడా కలిసి అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాలిక, ఆమె తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల చర్య: ఎఫ్ఐఆర్ నమోదు
ఈ ఘటనపై మంగళవారం బీబీడీ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ దంపతులు, మహిళా కానిస్టేబుల్ సోదరుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read also: Raja Raghuvanshi: సోదరుడి హత్యపై శ్రస్తి రఘువంశీ ఏమన్నారంటే?