దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చేపట్టిన క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెయిన్ పరీక్షల ఫలితాలను తాజాగా అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన జాబితాను పోస్టు చేసింది. మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT) కు హాజరుకావాల్సి ఉంటుంది.

భర్తీ ప్రక్రియ వివరాలు
ప్రస్తుతం భర్తీ చేయనున్న మొత్తం ఖాళీల సంఖ్య 13,735గా ఉంది. ఈ పోస్టులకు గత ఏడాది డిసెంబర్ 17 నుంచి ఈ ఏడాది జనవరి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమినరీ పరీక్షలను ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించగా, వాటి ఫలితాలు మార్చి చివరలో ప్రకటించారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరయ్యారు.
మెయిన్ పరీక్ష వివరాలు
ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1 వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, మార్చి నెలాఖరులో ఫలితాలను ప్రకటించారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి ఏప్రిల్ 10, 12 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఫలితాలను వెల్లడించారు.
Read also: Schools : నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం