హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన ఓ యువతి ట్రేడింగ్‌లో (In trading) లాభాలంటూ నమ్మించి మోసపోయింది. అరగంటలో రూ.5వేలు లాభమంటూ మొదలు పెట్టిన ఈ ట్రిక్ ఆమెను రూ.1.27 లక్షలు కోల్పోయేలా చేసింది.సిటీకి చెందిన 24 ఏళ్ల విద్యార్థిని, ‘GP Discussion 063’ అనే టెలిగ్రామ్ గ్రూపులో చేరింది. ఈ గ్రూప్‌లో ట్రేడింగ్‌తో డబ్బు సంపాదించవచ్చని ఆకర్షణీయమైన మెసేజ్‌లు వచ్చాయి.వారితో మాట్లాడిన బాధిత యువతి మొదటగా రూ.10,000 పెట్టుబడి పెట్టింది. అరగంటలోనే రూ.5,000 లాభం వచ్చిందంటూ రూ.15,000 ఆమె ఖాతాలోకి జమ చేశారు. ఈ పరిణామంతో ఆమె నమ్మకం మరింత బలపడింది.
రెండోసారి అధిక లాభాల వంచన
తర్వాత దోపిడీ పెరిగింది. రూ.31,572 పెట్టుబడి పెడితే రూ.70,000 వస్తుందని హామీ ఇచ్చారు. మాట చక్కగా ఉండటంతో ఆమె ముందుకు వెళ్లింది. ఈసారి కూడా డబ్బు జమైంది.
మూడు విడతల్లో భారీగా చెల్లింపు
ఈ విజయాలతో ఉత్సాహపడిన యువతి మరోసారి పెద్ద మొత్తాన్ని చెల్లించింది. విడతల వారీగా ఆమె మొత్తం రూ.1,27,354 చెల్లించింది. ఆపై నేరగాళ్లు తలదాచుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
డబ్బు జమ కాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ మోసానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Mangli Birthday Party : ప్లీజ్ నా ఫొటో వేయొద్దు.. నటి ఆవేదన