ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకంపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. చంద్రబాబు ప్రవేశపెడుతున్న ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ప్రోత్సాహకంగా డబ్బు అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఉపయోగించి ఒక సెటైరికల్ ట్వీట్ చేసింది.
జగన్ మాటలు
జగన్ ఓ సభలో “నీకు రూ.15వేలు… నీకు రూ.15వేలు…” అంటూ మాట్లాడిన పాత వీడియో క్లిప్‌ను టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ, “రేపు ప్రారంభం కానున్న ‘తల్లికి వందనం’ పథకంలో ఒక్కో విద్యార్థికి ఎంతెంత ఇస్తారో చెబుతున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్” అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది.
Read Also : S.Jaishankar : పశ్చిమ దేశాలపై జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు
ఈ ట్వీట్ కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
రేపు ప్రారంభం కానున్న
తల్లికి వందనం పథకంలో ఒక్కో విద్యార్థికి ఎంతెంత ఇస్తారో చెబుతున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్..#TallikiVandanam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/C0P1rdBldo— Telugu Desam Party (@JaiTDP) June 11, 2025