యూపీఐ (UPI) లావాదేవీలపై ఎలాంటి ఫీజులు లేదా ఛార్జీలు విధించట్లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టంగా తెలిపింది. ఇటీవల కొంతమంది వ్యాపారులు, కస్టమర్లు మధ్య సర్క్యూలేట్ అవుతున్న పుకార్లను ఖండిస్తూ కేంద్రం స్పందించింది. రూ. 3,000 కంటే ఎక్కువ విలువ ఉన్న యూపీఐ పేమెంట్లపై MDR (Merchant Discount Rate) ఛార్జీలు తీసుకుంటారని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని పేర్కొంది.
MDR ఛార్జీలను అమలు
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. “యూపీఐ వేదికపై జరుగుతున్న లావాదేవీలపై ప్రభుత్వం ఎలాంటి MDR ఛార్జీలను అమలు చేయడం లేదు. ఇది పూర్తిగా ఉచిత విధానం,” అని ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఫీజులు విధించడం లేదు.
తప్పుడు ప్రచారాలు
ఈ తప్పుడు ప్రచారాలు ప్రజల్లో గందరగోళానికి దారి తీసే అవకాశం ఉండడంతో, ప్రజలు అధికారిక ప్రకటనలు, ధృవీకరించిన సమాచారం మాత్రమే నమ్మాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచేందుకు యూపీఐ వ్యవస్థను ఉచితంగా కొనసాగించడం ప్రభుత్వ ధ్యేయంగా ఉందని స్పష్టం చేసింది.
Read Also : Tigers : ఆ కొంగకు ఎంత ధైర్యం : పులులతో పోరు..