యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ (War 2)కోసం డబ్బింగ్ పనులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ డబ్బింగ్ స్టూడియోలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆయన డబ్బింగ్ చెబుతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ స్టూడియోకు వచ్చి డబ్బింగ్ చెప్పే దృశ్యాలను చిత్రబృందం ఓ స్పెషల్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
హృతిక్ – ఎన్టీఆర్ కాంబోపై భారీ అంచనాలు
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఇందులో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు టాక్. ఇప్పటికే వీరిద్దరి పాత్రలు, స్క్రీన్ ప్రెజెన్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదేశ్యకత్వం సంచలన దర్శకుడు అయాన్ ముఖర్జీ చేపట్టారు. వర్మ యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రం(War 2)పై దేశవ్యాప్తంగా సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వరల్డ్ వైడ్ గా విడుదలకు సన్నాహాలు
‘వార్ 2’ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతున్నది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ఇప్పటికే మేకర్స్ వ్యూహాత్మకంగా ప్రమోషన్ పనులను ప్రారంభించారు. మూడు భాషల్లో ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెబుతున్న విషయం ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. థ్రిల్లింగ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎన్టీఆర్, హృతిక్ మధ్య కాంబినేషన్ ‘వార్ 2’ను సూపర్ హిట్ లైనప్గా నిలిపే అవకాశం ఉంది.
Read Also : Jagan’s Visit to Podili : జగన్ కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లతో దాడి