తాజాగా మధ్యప్రదేశ్‌లో (In Madhya Pradesh) ఓ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రాజా రఘువంశీ అనే యువకుడిని హనీమూన్ ట్రిప్‌లో (On a honeymoon trip) హత్య చేసిన కేసులో ఆయన భార్య సోనమ్ పాత్రపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇది సాధారణ హత్య కాదు, ప్రేమకోసం ముందుగానే ప్రణాళిక వేసిన శాడిస్టిక్ పథకం.పోలీసుల కథనం ప్రకారం, భర్తను హత్య చేయించేందుకు సోనమ్ మొదట నిందితులకు రూ.4 లక్షల సుపారీ ఆఫర్ చేసింది. కానీ వారు ఒప్పుకోకపోవడంతో ఆ మొత్తాన్ని రూ.20 లక్షల వరకు పెంచినట్టు సమాచారం.మే 11న సోనమ్, రాజా వివాహం జరిగింది. పెళ్లైన కొద్దికాలానికే ఆమె భర్తను మాయం చేయాలని నిర్ణయించుకుంది. బెంగళూరులో నిందితులను కలిసి పక్కా ప్లాన్ వేసింది. షిల్లాంగ్‌కు వెళ్లకపోయినా ఆమె ప్రియుడు ఈ కుట్ర వెనుక కీలకంగా ఉన్నాడు.మే 21న సోనమ్-రాజా జంట గువహటీకి వెళ్లింది. నిందితులు వారి వెంటనే షిల్లాంగ్ వచ్చారు. మే 23న జలపాతాల దగ్గరకు వెళ్లిన దంపతులను నిందితులు అనుసరించారు. అక్కడే రాజాను హత్య చేయాలని సోనమ్ సూచించినట్టు సమాచారం.
అలసిన నటనతో భర్తను ఫాలో అయ్యే దారిలోకి తీసుకెళ్లింది
ఆ రోజు సోనమ్ అలసిపోయినట్టు నటించి భర్త వెనక నడవడం ప్రారంభించింది. నిందితులు ముందు వెళ్లగా, సోనమ్ వారితో కలిసి భర్తను హత్య చేయాలనుకున్నట్టు తెలుస్తోంది.
హత్య అనంతరం మృతదేహాన్ని లోయలో తోసారు
రాజాపై తీవ్రంగా దాడి చేసి, తలపై గట్టిగా కొట్టారు. వెంటనే అతడు కూలిపోయాడు. అనంతరం మృతదేహాన్ని లోయలోకి తోసేశారు. దీనిలో సోనమ్ కూడా భాగమయ్యిందని సమాచారం.
సోషల్ మీడియాలో పోస్టులే ఆమెను దొరికేలా చేశాయి
జూన్ 2న మృతదేహం బయటపడింది. జూన్ 3న పోలీసులు సోనమ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. భర్త ఫొటో లేకుండా సోనమ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కేసులో కీలక మలుపు తిప్పాయి.
Read Also : Piggy Bank : బురదలో దొరికిన ఓ వస్తువు అతడిని కోటీశ్వరుడిని చేసింది..