వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (Warner Bros. Discovery) వచ్చే ఏడాది (2026) నాటికి రెండు పబ్లిక్ కంపెనీలుగా విడిపోయేందుకు సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం సంస్థ వ్యాపార విభాగాలను స్పష్టంగా వేరు చేయడమే లక్ష్యంగా తీసుకున్న చర్యగా చెప్పొచ్చు. తన స్ట్రీమింగ్ సేవల నుంచి కేబుల్ వ్యాపారాన్ని విడతీయనుంది. స్ట్రీమింగ్ అండ్ స్టూడియోస్ కంపెనీలో వార్నర్ బ్రదర్స్ (Warner Bros. Discovery) టెలివిజన్, వార్నర్ బ్రదర్స్ (Warner Bros. Discovery) మోషన్ పిక్చర్ గ్రూప్, డీసీ స్టూడియోస్, హెచ్‌బీఓ, హెచ్‌బీఓ మ్యాక్స్‌తో పాటు వాటి సినిమా, టెలివిజన్ లైబ్రరీలుంటాయి. వ్యాపార విభజన ద్వారా దృఢమైన ఫోకస్, స్వతంత్ర నిర్వహణ, వృద్ధికి అవకాశం పొందడమే ప్రధాన లక్ష్యం. మీడియా మరియు వినోద రంగంలో ప్రత్యేకీకృత వ్యూహాలతో ఎదగాలనే ప్రయత్నం.

గ్లోబల్ మార్గదర్శకంగా మారే అవకాశం
ద గ్లోబల్ నెట్‌వర్క్స్ కంపెనీలో యూఎస్‌లోని సీఎన్‌ఎన్, టీఎన్‌టీ స్పోర్ట్స్; డిస్కవరీ, ఐరోపాలోని అగ్రగామి ఫ్రీ-టు-ఎయిర్ ఛానళ్లు, డిస్కవరీ+ స్ట్రీమింగ్ సర్వీస్, బ్లీచర్ రిపోర్ట్ వంటివి ఉండనున్నాయి. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సీఈఓ డేవిడ్ జస్లావ్ త్వరలో స్ట్రీమింగ్ అండ్ స్టూడియోస్‌కు సీఈఓగా; వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి సీఎఫ్‌ఓగా ఉన్న గున్నర్ వీడెన్‌ఫెల్స్ భవిష్యత్‌లో గ్లోబల్ నెట్‌వర్క్స్‌కు సీఈఓగా బాధ్యతలు చేపడతారు. వచ్చే ఏడాదిలో పూర్తి కానున్న ఈ విభజన వరకు ప్రస్తుత హోదాల్లోనే వీరు కొనసాగుతారు. వినోద రంగంలో కొత్త పోటీదారుల మాదిరిగా రెండు సంస్థలు ప్రత్యేక మార్కెట్ వృద్ధి చూపే అవకాశముంది. ఇన్వెస్టర్ల దృష్టిలో స్పష్టత, విశ్వసనీయత పెరగవచ్చు.