ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా “విద్యార్థి మిత్ర కిట్”(Vidyarthi Mitra)ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేసింది. జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభమయ్యే సందర్భంలోనే విద్యార్థులకు కిట్లు అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20లోపుగా పంపిణీ పూర్తి చేయాలని హెడ్మాస్టర్లకు సూచించింది.
కిట్‌లో ఏమేమున్నాయంటే…
ఈ విద్యార్థి మిత్ర కిట్‌లో విద్యార్థులకు అవసరమైన అన్ని అవసరమైన వస్తువులు ఉంటాయి. అందులో రెండు జతల యూనిఫామ్‌లు, బెల్ట్, నోట్‌బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులు మరియు ఒక ఇంగ్లీష్ డిక్షనరీ లభ్యం అవుతాయి. విద్యార్ధుల విద్యా ప్రయాణానికి వీటన్నీ ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
ప్రతి కిట్‌పై రూ.2,279 వ్యయం
ప్రతి విద్యార్థి మిత్ర కిట్‌పై ప్రభుత్వం సగటున రూ.2,279 ఖర్చు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయడానికి ఇప్పటికే మండలాలకు సరఫరా ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రయత్నాలతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని, పిల్లల్లో హాజరు శాతం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Renuka Chowdhury : జగన్ పై రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు