ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ కోల్పోయిందని, రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థను దారుణంగా దుర్వినియోగం చేశారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (Venkateswara Rao) ఆరోపించారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన “పోలీసు వ్యవస్థలో సంస్కరణలు” అనే చర్చా వేదికలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, పోలీసు వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితులను బట్టే ప్రజాస్వామ్య స్థితిగతులు అర్థమవుతాయని అన్నారు.

జగన్పై నేర కేసులు – కానీ కోర్టుకు ఎందుకు రావడం లేదు?
ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యల ప్రకారం, జగన్పై అనేక కేసులు ఉన్నా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని ఏడేళ్లుగా న్యాయస్థానానికి వెళ్లడం లేదన్నారు. పోలీసు శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు చైతన్యంతో ఉద్యమించి పార్టీలు తమ మేనిఫెస్టోలో పోలీసు సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించడం – నియంతృత్వానికి నిదర్శనం
గన్ తన హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసు అధికారులతో తప్పుడు కేసులు నమోదు చేయించాడని, ప్రభుత్వ యంత్రాంగాన్ని భయపెట్టి తనకు వ్యతిరేకంగా ఉండే నేతల, సామాజిక కార్యకర్తలపై అక్రమ చర్యలు చేపట్టాడని అన్నారు.
జగన్ పాలనపై సమగ్ర విచారణ
జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దుర్మార్గాలన్నింటిపైనా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు కొట్టడం చట్టవిరుద్ధమని, ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి చర్యలను అందరూ ఖండించాల్సిందేనన్నారు.
పోలీసు సంస్కరణలు – సమయం ఆసన్నమైంది
సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ డీఏఆర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Read also: Kavati Manohar: మాజీ మేయర్ మనోహర్ ను సస్పెండ్ చేసిన జగన్