हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Pahalgam : ఉగ్రదాడి తో ఆగిన బతుకు చక్రం

Sudheer
Pahalgam : ఉగ్రదాడి తో ఆగిన బతుకు చక్రం

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam ) వద్ద ఇటీవల జరిగిన ఉగ్రదాడి (tTerror Attack) తర్వాత అక్కడి పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం పడింది. పర్యాటకులు పహల్గామ్‌ పర్యటనను తగ్గించడం తో, స్థానికులకు ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా పర్యాటకులపై ఆధారపడే పోనీవాలాలు (పర్యాటకులతో గుర్రపు స్వారీ చేయించేవారు) తీవ్రంగా కుదేలయ్యారు. పహల్గామ్‌కు జీవనాధారంగా ఉన్న ఈ రంగం ఇప్పుడు నష్టాల బాటలో సాగుతోంది.

గుర్రాల యజమానులకు భారీ నష్టం

పహల్గామ్ ప్రాంతంలో సుమారు 6 వేల గుర్రాలు పర్యాటక సేవలకు సిద్ధంగా ఉండగా, ప్రస్తుతం వాటిలో కేవలం 100 గుర్రాలకే పని దొరుకుతోంది. ఈ పరిస్థితి వల్ల రోజుకు సుమారు రూ. 2 కోట్ల మేర నష్టాన్ని తెస్తోంది. ఒక్కో గుర్రాన్ని సుమారు లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన యజమానులు, వాటికి రోజూ రూ.400 విలువైన ఆహారం పెట్టాల్సి వస్తోంది. గతంలో ఒక్క గుర్రం రోజుకు సగటున రూ.3,000 ఆదాయం తీసుకురాగలిగేది.

ఉద్యోగుల ఆర్ధిక పరిస్థితి దారుణం

పర్యాటకుల రాక తగ్గడంతో గుర్రాల యజమానులతో పాటు, అక్కడ పనిచేసే పని వారి పరిస్థితి కూడా మరింత దయనీయంగా మారింది. ఉపాధి కోల్పోయినందున వారు కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం అందడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకరంగం పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read Also : Teachers Strikes : నేటి నుంచి ఏపీలో టీచర్ల నిరాహార దీక్షలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870