ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తింపు పొందిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం (SIB) మాజీ అధికారి ప్రభాకర్ రావు (Prabhakar Rao) హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన అమెరికాలో నివాసం ఉండగా, ఇటీవల దుబాయ్ (Dubai ) మీదుగా ప్రయాణించి శనివారం నగరానికి వచ్చారు. అతని రాకతో ఈ కేసులో కొత్త మలుపు తిరిగే అవకాశముంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయన అమెరికాలో తలదాచుకున్నట్లు సమాచారం.
సిట్ విచారణకు హాజరయ్యే అవకాశమున్న ప్రభాకర్
రేపు ఉదయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. కేసులో కీలక అంశాలపై ఆయనను విచారించేందుకు సిట్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతని పాత్రపై స్పష్టత రావడం, ఆధారాల సేకరణలో సహకారం తీసుకోవడం లక్ష్యంగా విచారణ జరగనుంది.
సిట్ కార్యాలయం మార్పు చర్చనీయాంశం
ఇక మరోవైపు సిట్ కార్యాలయాన్ని మాసబ్ ట్యాంక్ నుంచి జూబ్లీ హిల్స్‌కు మార్చడం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అధికార వర్గాలు భద్రతా కారణాలను సూచించినప్పటికీ, రాజకీయంగా ఈ మార్పు అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఈ పరిణామాల మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత దృష్టి ఆకర్షిస్తోంది.
Read Also : Ponguleti Srinivas Reddy : ఖమ్మం జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన