అమెరికాలో (In America) చదువుకుంటున్న భారతీయ విద్యార్థిని శ్రియా బేడీ (Shriya Bedi) ఒక్కసారిగా మోసగాళ్ల జాలలో పడిపోయింది. ఫలితంగా ఆమె ఏకంగా 5,000 డాలర్లు నష్టపోయింది. ఈ ఘటనపై ఆమె స్పష్టంగా స్పందిస్తూ, తమలాంటి విద్యార్థులు ఇటువంటి మోసాలకు గురికాకూడదని హెచ్చరిస్తోంది.2022లో ఎఫ్-1 వీసాతో అమెరికా వెళ్లిన శ్రియా, ఇండియానా యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తోంది. మే 29న ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసినవాడు తాను ఇమిగ్రేషన్ అధికారి అంటూ ఆమెను భయపెట్టాడు. వలస చట్టాలను ఉల్లంఘించావంటూ బెదిరింపులకు దిగాడు. ఐసీఈ వెబ్సైట్లో తన డిటైల్స్ చూడమని కూడా చెప్పాడు.ఆ తరవాత మరొకరు ఫోన్ చేసి తాను ఒలింపియా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పారు. శ్రియ ఫోన్‌పై నిఘా పెట్టామని, కాల్ కట్ చేస్తే కేసు తీవ్రమవుతుందని హెచ్చరించారు. దాదాపు మూడు గంటల పాటు ఆమెను ఫోన్లోనే బంధించారు.
వారు అన్నదే నమ్మాల్సి వచ్చింది
వారు తన వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడి నుంచో సేకరించారు. తన పేరుతో అరెస్టు వారెంట్ ఉందని చెప్పడంతో తీవ్రంగా భయపోయింది. చివరికి వాళ్లు చెప్పినట్టుగానే యాపిల్, టార్గెట్ గిఫ్ట్ కార్డులు worth $5,000 కొనుగోలు చేసి కోడ్స్ ఇచ్చింది.వాళ్లు మరుసటి రోజు పోలీసులు వస్తారని చెప్పారు. కానీ ఎవరూ రాలేదు. అరెస్టు, డిపోర్టేషన్ అనే మాయలతో ఆమెను మోసగాళ్లు గంటల తరబడి నరకం చూపించారు. ఆ నష్టంతో ఆమె ఆర్థికంగా పూర్తిగా క్షీణించిపోయింది.
ఇలాంటి మోసాల నుంచి జాగ్రత్త పడాలి
ఒంటరిగా అమెరికాలో ఉంటున్న శ్రియా, కుటుంబ మద్దతు లేక తమంతట తాను తేరుకోవాల్సి వచ్చింది. మోసగాళ్లు ప్రభుత్వ అధికారుల్లా వ్యవహరిస్తారని, నిజంగా ఎవరు అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం లేకుండాపోతుందని ఆమె చెప్పింది.తనలాగే ఇంకెవరూ మోసపోకూడదని ఆమె కోరింది. అంతర్జాతీయ విద్యార్థులకు కూడా లాయర్ లేదా పోలీసు సహాయం పొందే హక్కు ఉందని గుర్తుచేసింది. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే అధికారిక నంబర్ల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించింది.
Read Also : Maruti Suzuki : స్విఫ్ట్ కార్ల తయారీని నిలుపుదల చేసిన మారుతీ సుజుకి