ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం, తూర్పు విదర్భ నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి ఏర్పడింది. ఇదే ద్రోణి తెలుగు రాష్ట్రాల వర్షాలకు కారణంగా మారుతోంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాలలో వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు అనుభవించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్, యానాలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
- ఈరోజు (ఆదివారం):
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తేమ ఎక్కువగా ఉండే వాతావరణం నెలకొంటుంది. - రేపు (సోమవారం):
ఇదే తరహాలో వర్షాలు, ఉరుములు కొనసాగుతాయి. సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. - ఎల్లుండి (మంగళవారం):
కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, తక్కువ ఎండలతో కూడిన వాతావరణం ఉంటుంది. వాహనదారులు, రైతులు ఈ విషయాన్ని గమనించాలి.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
- తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో:
తక్కువ నుంచి మోస్తరు వర్షాలు వచ్చే అవకాశముంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు ప్రబలంగా ఉండవచ్చు. - రేపు & ఎల్లుండి:
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతం
- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాబోయే మూడు రోజుల్లో అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిపాటి వరదలు ఏర్పడే ప్రమాదం ఉంది.
- ఈదురు గాలులు:
గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పాత భవనాల్లో నివాసం ఉండే వారు, భారీ చెట్ల వేపున వాహనాలు నిలిపే వారు జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణ రాష్ట్రం
ఈరోజు(ఆదివారం) తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(సోమవారం), ఎల్లుండి(మంగళవారం) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. అటు వచ్చే 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులు వీస్తాయి.
ఈ మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, రైతులు, ప్రయాణికులు వాతావరణ సూచనలను పరిగణలోకి తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Read also: Chandrababu: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్
Etela Rajender: కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకేంటి: ఈటల రాజేందర్