తెలంగాణ(Telangana)లో గత కొన్ని రోజులుగా పెరిగిన ఎండలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎండలు, పొడిబారిన వాతావరణం (weather) వల్ల తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్న ప్రజలకు, ఈరోజు నుండి వర్షాలు కురిసే అవకాశం ఉండడం శుభవార్తగా మారింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం, నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడనున్నాయి.
ఈ జిల్లాల్లో వర్షాలు
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పురపాలక శాఖలు, జిల్లా పాలన యంత్రాంగాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ట్రాఫిక్, నీటి మళ్లింపు వంటి అంశాల్లో అధికారులు సమర్ధంగా వ్యవహరించాలని సూచనలు ఇచ్చారు. రాబోయే నాలుగు రోజులు వర్షాల నేపథ్యంలో ప్రజలు భద్రతాపరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also : Lioness : వీధిలో నిద్రిస్తున్న వ్యక్తి వద్దకు సింహం!