పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి (Prabhas – Sandeep Vangaa ) వంగా కలిసి చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit )ఇటీవల ఓ కొత్త వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొణె (Deepika Padukone) ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఆమెను సినిమా నుంచి తప్పించినట్లు తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా ఆమె చేసిన భారీ డిమాండ్‌నే చెబుతున్నారు.
35 రోజుల షూటింగ్‌కు రూ. 25 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్
తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, దీపిక పదుకొణె ‘స్పిరిట్’ చిత్రానికి 35 రోజుల షూటింగ్‌కు రూ. 25 కోట్లు రెమ్యూనరేషన్ అడిగినట్లు తెలిసింది. అంతేకాదు, సినిమాకు వచ్చిన లాభాల్లో 10% షేర్ కూడా కావాలని ఆమె డిమాండ్ చేసిందట. ఈ డిమాండ్ చిత్ర బడ్జెట్‌కు భారీగా ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో, చిత్రబృందం ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించాల్సి వచ్చిందని తెలుస్తోంది.
తెలుగు డైలాగ్స్ చెప్పేందుకు నిరాకరణ
అంతేకాదు, తెలుగు డైలాగ్స్‌ను ఆమె చెప్పేందుకు ఆసక్తి చూపకపోవడం కూడా మరో కారణంగా మారినట్లు సమాచారం. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఇటీవల తన చిత్రం ‘యానిమల్’తో పేరు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రిప్తి పాత్రకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని సమాచారం. ఈ పరిణామాలతో ‘స్పిరిట్’పై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది.
Read Also : TDP : టీడీపీలో చేరికలపై పల్లా శ్రీనివాస రావు కీలక ఆదేశాలు