ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మెగా డీఎస్సీ (Mega DSC) 2025 పరీక్షలు నేడు (జూన్ 6, 2025) నుండి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు కలలుగన్న ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు పోటీ పడుతున్నారు.

పరీక్షా నిర్వహణ విధానం:
ఈ ఏడాది డీఎస్సీ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT – Computer Based Test) నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చేపట్టింది. పరీక్షలను రోజుకు రెండు సెషన్లుగా నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు కనీసం గంటన్నర ముందు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా హాల్లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అలానే రెండు చేతులు లేని అభ్యర్థులు, దృష్టిలోపం ఉన్నవారికి ప్రత్యేకంగా సహాయకుల సదుపాయం అందిస్తున్నారు.
దరఖాస్తుల గణాంకాలు:
ఈసారి డీఎస్సీకి దరఖాస్తులు భారీగా వచ్చాయి. మొత్తం 5.7 లక్షలకుపైగా దరఖాస్తులు 3.35 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు సమాచారం. అభ్యర్థులు అధిక సంఖ్య కారణంగా రాష్ట్రం మాత్రమే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ పరీక్ష కోసం ఏపీ వ్యాప్తంగా మొత్తం 154 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ముఖ్యమైన నిబంధనలు:
అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. అంతే కాకుండా హాల్ టికెట్‌పై ఫోటో లేకపోతే రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని అధికారులు వెల్లడించారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి వంటి గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకురావాలని సూచించారు.
Read also: Pawan Kalyan : బక్రీద్ వేళ గో సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పవన్ కల్యాణ్ సూచన
Bakrid 2025 : ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే చర్యలు – AP రాష్ట్ర పశుసంవర్ధక శాఖ