భాజపా సీనియర్ నేత కైలాష్ విజయ్‌వర్గీయ (Kailash Vijayvargiya) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఆయన, ఇటీవల ఇండోర్‌లో జరిగిన ఓ సభలో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. మహిళలు చిట్టిపొట్టి దుస్తులు ధరించడం నాకు ఇష్టం లేదు, అంటూ ఆయన స్పష్టం చేశారు.విజయ్‌వర్గీయ మాట్లాడుతూ, పాశ్చాత్య దేశాల్లో తక్కువ దుస్తులు వేసుకున్న మహిళను అందంగా చూస్తారని, కానీ భారతదేశంలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించే మహిళలే అందంగా కనిపిస్తారని అన్నారు. ‘‘ఒక మహిళ చక్కగా చీర కట్టుకుని, హుందాగా కనిపిస్తే అందమే’’ అని వ్యాఖ్యానించారు.తక్కువ దుస్తులు వేసుకోవడం అందం కాదు. అలాగే పొట్టిగా మాట్లాడే నాయకుడి గొప్పతనాన్ని కూడా నేను నమ్మను. మహిళ దేవత స్వరూపం. ఆమె ఆహార్యంలో మర్యాద ఉండాలి, అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పుట్టించాయి కానీ, బయట తీవ్ర విమర్శలు వచ్చాయి.
సెల్ఫీ అడిగిన యువతులకు ‘బట్టలపై’ చిట్కా ఇచ్చే మనిషిని
‘‘కొన్నిసార్లు యువతులు సెల్ఫీ కోసం నన్ను కలుస్తారు. నేను వారిని చూసి చెబుతాను – బేటా, తర్వాత సారి మంచి బట్టలు వేసుకుని రా, అప్పుడే ఫోటో తీసుకుందాం’’ అని చెప్పారు. ఇది ఆయన నైతిక సలహాగా చెప్పినప్పటికీ, పలువురు దీన్ని అభ్యంతరకరంగా చూశారు.
ఇదే తొలిసారి కాదు – గతంలోనూ ఇలాగే షాకింగ్ వ్యాఖ్యలు
2022లో కూడా ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. హనుమాన్ జయంతి సభలో అసభ్య దుస్తులు వేసుకున్న మహిళలను రాక్షసి శూర్పణఖతో పోల్చారు. దేవుడు అందం ఇచ్చాడు, కనీసం మర్యాదైన బట్టలైనా వేసుకోండి అని అప్పట్లో వ్యాఖ్యానించారు.విజయ్‌వర్గీయ వ్యాఖ్యలు మహిళల అభివృద్ధికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. వారి వస్త్రధారణపై నిబంధనలు విధించడం, తిరోగమన దృక్పథాన్ని ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నిస్తున్నారు.
Read Also : Miss Grand India 2025 : మిస్ గ్రాండ్ ఫైనల్స్‌కు ఏపీ యువతి సంజన వరద