हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Central Govt : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Sudheer
Central Govt : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రవేశపెట్టిన ప్రధాన పంట బీమా పథకం ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) 2016 ఫిబ్రవరి 18న ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధులు తదితర కారణాలతో పంటలకు నష్టమొచ్చినపుడు రైతులకు ఆర్థిక భద్రత కల్పించబడుతుంది. ఇది కేవలం నష్టపరిహారాన్ని ఇవ్వడమే కాదు, రైతులు వ్యవసాయాన్ని ధైర్యంగా కొనసాగించేందుకు సహాయపడే విధంగా రూపొందించబడింది. తక్కువ బీమా ప్రీమియంతోనే పంటలకు భద్రత కల్పించడం ఈ పథకానికి ప్రత్యేకత.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే

ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంది. రైతులు అధికారిక వెబ్‌సైట్ https://pmfby.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రైతుగా రిజిస్టర్ అవ్వాలి, పంట మరియు జిల్లా ఎంపిక చేయాలి, అవసరమైన పత్రాలు (ఆధార్, భూమి పత్రాలు, బ్యాంక్ వివరాలు) అప్‌లోడ్ చేసి, ప్రీమియాన్ని చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి. బీమా కవర్ పొందిన తర్వాత పంట నష్టానికి పరిహారం పొందొచ్చు. ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

కవర్ అయ్యే పంటల వివరాలు

ఈ పథకం ద్వారా ఖరీఫ్, రబీ, వాణిజ్య పంటలకు బీమా అందించబడుతుంది. ఉదాహరణకు బియ్యం, మక్క, శనగ, గోధుమ, పత్తి, బంగాళాదుంప మొదలైనవి. రాష్ట్రానికి అనుగుణంగా కవర్ అయ్యే పంటల వివరాలు వెబ్‌సైట్‌లో లభిస్తాయి. రైతులు వ్యవసాయ రుణం తీసుకున్నా లేదా స్వంత భూమిలో వ్యవసాయం చేస్తున్నా, అందరికీ ఈ పథకం లభిస్తుంది. ప్రకృతి సహజ విపత్తుల నేపథ్యంలో, PMFBY రైతులకు ఒక రక్షణ కవచంగా నిలుస్తుంది.

Read Also : TMC MP Mahua Moitra: పెళ్లి చేసుకున్న పొలిటికల్ ఫైర్ బ్రాండ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870