ఈ మధ్యకాలంలో ఓటీటీ వేదికగా విడుదలవుతున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. థియేటర్లలో విజయం సాధించిన సినిమాలు కొన్ని వారాల్లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సాధారణమైంది. అయితే కొన్ని సినిమాలు, కథా బలం, నటీనటుల అద్భుత ప్రదర్శన సాంకేతిక విలువలు కారణంగా ఎక్కువ గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వచ్చాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి “జాట్” (Jat).

జాట్ – యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్
తెలుగు డైరెక్టర్లు, నిర్మాతలు తెరకెక్కించిన సినిమాలను కూడా ఎగబడి చూస్తున్నారు. ఈ మూవీ మొదట తెలుగులోనే తీద్దామనుకున్నారు. అది కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో. అయితే అప్పటికే ఇతర సినిమాలతో బాలయ్య బిజీగా ఉండడంతో ఈ సినిమా బాలీవుడ్ కు వెళ్లింది. పేరుకు హిందీ సినిమానే అయినా ఇందులో నటించింది మొత్తం దాదాపు తెలుగు వారే.
నటీనటుల హై లైట్
సన్నీ డియోల్ (Sunny Deol) లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలో, తెలుగు నటులు రెజీనా కసాండ్రా, జగపతి బాబు, రమ్యకృష్ణ, రవిశంకర్, ఉపేంద్ర, సయామీ ఖేర్, జెరీనా వాహబ్, వినీత్ కుమార్, స్వరూప ఘోష్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ రెజీనా ఓ రేంజ్ లో విలనిజం పండించింది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను నిర్మించినది మరెవరో కాదు పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్.
బ్యాక్‌గ్రౌండ్, నిర్మాణ విలువలు
ఈ సినిమా కథ కూడా చీరాలలోని మోతుపల్లి వేదికగా సాగుతుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ బాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సన్ని డియోల్ హీరోగా నటించాడు.
బాక్సాఫీస్ వద్ద 120 కోట్ల వసూళ్లు
ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో ఏప్రిల్ 10న విడుదలైన జాబ్ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఓవరాల్ గా రూ. 120 కోట్లకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయలేదు. దీంతో చాలా మంది ఈ యాక్షన్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది.
ఓటీటీలో జాట్ – నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో
జాట్ సినిమా ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. గురువారం (జూన్ 05) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగులోనూ జాట్ అందుబాటులో ఉంది. కుటుంబం మొత్తం కలిసి చూడదగిన మాస్ అండ్ ఎమోషనల్ డ్రామా కావడంతో, ఓటీటీ వేదికపై కూడా ఈ సినిమా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.
Read also: Telugu Movies: సంక్రాంతికి సిద్దమవుతున్న స్టార్ హీరోల సినిమాలు