పాకిస్తాన్లోని కరాచీలో వరుస భూకంపాలు (Earthquakes) ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, కరాచీ(Karachi) నగరంలో 48 గంటల్లో 20కి పైగా (20 mild earthquakes)తక్కువ తీవ్రత గల భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల తీవ్రత సాధారణంగా 2.5 నుండి 3.5 రిక్టర్ స్కేల్ మధ్య ఉంది. ఆదివారం రాత్రి నుంచి 48 గంటల్లో దాదాపు 21సార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టరు స్కేలుపై 2.1 నుంచి 3.6 మధ్య ఉన్నాయి.

కూలిన జైలు గోడ
ఆదివారం రాత్రి 3.6 తీవ్రతతో సంభవించిన భూకంపం అత్యంత శక్తివంతమైందిగా అక్కడి అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనల ధాటికి మాలిర్ జిల్లా జైలు గోడ పాక్షికంగా కూలిపోయింది. దీంతో దాదాపు 216 మంది ఖైదీలు పరారయ్యారు. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే వరుసగా స్వల్ప స్థాయిలో భూమి కంపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇది దేనికి సంకేతమో అంటూ ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రమాదకరమైన భూకంపం వచ్చే అవకాశం ఉందేమోనని భయపడుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదంటూ అక్కడి అధికారులు సూచిస్తున్నారు. అయితే, కొన్ని స్వతంత్ర సంస్థలు మాత్రం ప్రమాదం పొంచి ఉందంటూ హెచ్చరిస్తున్నాయి.
తాజా భూకంపాలు పెద్ద నష్టం కలిగించలేదు. సాధారణంగా, ఈ భూకంపాలు భూమి కంపించేలా చేస్తాయి, కానీ భవనాలకు పెద్ద నష్టం కలిగించవు. అయితే, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు 48 గంటల్లోనే దాదాపు 21 సార్లు భూమి కంపించినప్పటికీ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే, భారతదేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ మాత్రం ఆదివారం నుంచి కరాచీ ప్రాంతంలో ఎలాంటి భూకంప కార్యకలాపాలు నమోదు చేయలేదు. దీంతో పాక్ వ్యవస్థలపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కరాచీ ప్రాంతం మక్రాన్ సబ్డక్షన్ జోన్ సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవించవచ్చు, తద్వారా సునామీ ప్రమాదం కూడా ఉంది. పాకిస్తాన్ మేటరలాజికల్ డిపార్ట్మెంట్ (PMD) ప్రకారం, ఈ ప్రాంతంలో సునామీ ప్రమాదం ఎప్పుడైనా సంభవించవచ్చు.
Read Also : Israel Attack : 24 గంటల్లో 95 మంది మృతి!