ప్రకృతి మన అందరి బాధ్యత అని, దాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పర్యావరణ దినోత్సవం సందర్భంగా భావోద్వేగంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా (ప్రస్తుతం ఎక్స్) చేసిన పోస్ట్‌లో ఆయన ప్రకృతి పరిరక్షణపై ప్రజలకు గట్టిగా సందేశమిచ్చారు.అడవులు మన సంపద, వాటిని కాపాడుకోవాలి. నీటి వనరుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ మన బాధ్యతల్లో భాగం అని చంద్రబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని తెలిపారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) నేడు సందర్భంగా ఒక్కరోజే కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అందరూ చొరవతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘‘పచ్చటి పరిసరాలుంటేనే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
స్వచ్ఛాంధ్రలో భాగంగా మాస్టర్ ప్లాన్
స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి తోడుగా స్వచ్ఛాంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రతపై ఉద్యమం నడుస్తున్నట్టు వెల్లడించారు. చెత్తను ఇంధనంగా మార్చే కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని మరింత పటిష్టంగా కాపాడుతున్నట్టు చెప్పారు.
ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలనే ప్రధాన లక్ష్యం
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలనే ప్రధాన థీమ్‌గా నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ‘‘ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మేము కృషి చేస్తాం’’ అని ఆయన అన్నారు.
వనమహోత్సవంలో సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొనబోతున్నారు
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రకృతి పరిరక్షణలో వారి చొరవ ప్రజలకు మంచి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.
Read Also : Kuppam : పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన దొంగలు..